అనంతగిరి హిల్స్‌లో కొత్తగా ది బ్రీజ్.. బడ్జెట్ ధరలోని ప్యాకేజీలో ఇవన్నీ ఉంటాయ్
అనంతగిరి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. కొత్త ప్రీమియం ఎకో-టూరిజం ప్యాకేజీని బడ్జెట్ ధరలో తీసుకొచ్చారు. ఇందులో చాలా కవర్ అవుతాయి.
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGFDCL) తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ కింద వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో ప్రీమియం ఎకో టూరిజం 'ది బ్రీజ్' ప్యాకేజీని ప్రారంభించినట్లు ప్రకటించింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ టూరిస్టులకు మంచి అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తోంది. సందర్శకుల అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ది బ్రీజ్‌లో భాగంగా క్యూరేటెడ్ బసలు, గైడ్‌ల ఆధ్వర్యంలో అడవిలో తిరగడంలాంటివి ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించే కార్యకలాపాలను అందిస్తుంది.

ది బ్రీజ్ అనే పేరుతో పర్యావరణ అవగాహన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ పౌరులకు సురక్షితమైన, నిర్మాణాత్మకమైన, పూర్తిగా మార్గదర్శక అటవీ అనుభవాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టుగా TGFDCL ఒక ప్రకటనలో తెలిపింది.
ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన గుడారాలలో బస ఉంటుంది. ప్రణాళిక చేసిన ఓరియంటేషన్ సెషన్, శిక్షణ పొందిన ప్రకృతి శాస్త్రవేత్తలతో గైడెడ్ బర్డ్ వాక్‌లు, సఫారీ పర్యటనలు, మంచి భోజనం, క్యాంప్ ఫైర్ చుట్టూ విందు, టీ, స్నాక్స్, గడ్డి భూములలో ప్రత్యేకమైన 'బుష్ బ్రేక్‌ఫాస్ట్' ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు మొత్తం ప్యాకేజీకి వ్యక్తికి రూ.5,000 ఖర్చవుతుంది. జంటలు, కుటుంబాలకు తగ్గింపు ఆఫర్ కూడా ఉండనుంది. ఇది లగ్జరీ టెంట్ స్టే, గైడెడ్ ట్రెకింగ్, బర్డ్ వాచింగ్, సూర్యోదయ/సూర్యాస్తమయ వ్యూస్, అడవిలో ప్రత్యేకమైన బుష్ బ్రేక్‌ఫాస్ట్ వంటి సర్వీసులను అందిస్తుంది.
అనంతగిరి కొండలలో ప్రశాంతమైన ప్రకృతి దృశ్యంలో చక్కగా ప్లాన్ చేస్తారు. విలాసవంతమైన టెంట్లలో బస చేయవచ్చు. సందర్శకులు ప్రకృతిలో ఉన్నట్టుగా ఫీలవుతూనే ఆధునిక సౌకర్యాలను ఆస్వాదించేలా చూస్తారు. ఈ ప్యాకేజీలో ఇవి ఉంటాయి: వెల్‌కమ్ డ్రింక్, మంచి భోజనం, పక్షులను వీక్షించడం, ట్రెక్ అండ్ సఫారీ, సాయంత్రం టీ, స్నాక్స్, ప్రకృతిలో రాత్రి భోజనం, అడవిలో ప్రత్యేకమైన బుష్ బ్రేక్‌ఫాస్ట్. అంతేకాదు ఇందులో సూర్యోదయం, సూర్యాస్తమయం చూడవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


