Bank jobs : నెలకు రూ. 15వేల స్టైఫండ్‌తో బ్యాంకింగ్ శిక్షణ- పీఎన్బీ రిక్రూట్‌మెంట్ వివరాలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దేశవ్యాప్తంగా 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణతో పాటు నెలకు రూ. 15,000 వరకు స్టైఫండ్ లభిస్తుంది.
నిరుద్యోగులకు శుభవార్త! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దేశవ్యాప్తంగా 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రేపు, అంటే ఫిబ్రవరి 8, 2026 నుంచి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ దఫా రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026 అని గుర్తుపెట్టుకోవాలి.
పీఎన్బీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 శిక్షణ కాలం 12 నెలలు ఉంటుంది. ఇందులో అభ్యర్థులు రెండు వారాల ప్రాథమిక శిక్షణను, 50 వారాల ఆన్-ది-జాబ్ శిక్షణను పొందుతారు.
పీఎన్బీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026: అర్హత ప్రమాణాలు
జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి:
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు: 5 ఏళ్లు
ఓబీసీ అభ్యర్థులకు: 3 ఏళ్లు
దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ): 10 ఏళ్లు
జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు 35 ఏళ్ల వరకు, ఓబీసీ- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 40 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
పీఎన్బీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026- విద్యార్హత..
ఈ దఫా రిక్రూట్మెంట్లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్న వారు గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా.. 2025 డిసెంబర్ 31 కి ముందు డిగ్రీ ఫలితాలు ప్రకటించి ఉండాలి.
పీఎన్బీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026- స్టైఫండ్ వివరాలు..
బ్యాంకు గ్రామీణ, సెమీ-గ్రామీణ లేదా పట్టణ శాఖల్లో పనిచేయడానికి ఎంపికైన వారికి రూ. 12,300 స్టైఫండ్ లభిస్తుంది. అదే మెట్రో నగరాల్లోని శాఖల్లో పనిచేసే వారికి రూ. 15,000 స్టైఫండ్ అందుతుంది. శిక్షణ ముగిసిన తర్వాత నిర్వహించే ఫైనల్ అసెస్‌మెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అప్రెంటిస్ సర్టిఫికేట్ అందజేస్తారు.
కాగా.. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు ఉండాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోగలగడం వచ్చి ఉండాలి.
పీఎన్బీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026- ఫీజు వివరాలు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (పురుషులు)- రూ. 944
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (మహిళలు)- రూ. 708
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ- రూ. 236
ట్రాన్స్జండర్- రూ. 236
ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఇది నాన్-రీఫండబుల్.
పీఎన్బీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు చేయడం ఎలా?
అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ pnbindia.in లోని 'Recruitment' విభాగం ద్వారా లేదా బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ bfsissc.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టెప్ 1- పీఎన్బీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2- హోమ్ పేజ్ కిందకు స్క్రోల్ చేస్తే కెరీర్/రిక్రూట్‌మెంట్ సెక్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ‘Recruitment For 5138 Posts Of Apprentices’ కోసం వెతకండి.
స్టెప్ 3- అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయండి. పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి.
స్టెప్ 4- సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
స్టెప్ 5- అప్లికేషన్ ఫామ్‌ని జాగ్రత్తగా పరిశీలించండి. సేవ్ చేయండి.
స్టెప్ 6- పీఎన్బీ రిక్రూట్‌మెంట్ 2026 కోసం అప్లికేషన్ ఫీజును చెల్లించండి. ఆన్లైన్ ఫామ్‌ని సబ్మిట్ చేయండి.
స్టెప్ 7- భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి.
పరీక్షను 2026 మార్చి మొదటి వారంలో (తాత్కాలికంగా) నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

E-Paper












