Artificial Intelligence : మనుషులను ‘రిక్రూట్​’ చేసుకుంటున్న AI! ఇంకా ఎన్నెన్ని చూడాలో..

ఏఐ ఏజెంట్లు తమకు అవసరమైన భౌతిక పనులు లేదా మనుషుల నిర్ణయాలు అవసరమైన పనుల కోసం మనుషులను రిక్రూట్​ చేసుకునే సరికొత్త ప్లాట్‌ఫారమ్ పుట్టుకొచ్చింది! అదే 'RentAHuman.ai'. అసలేంటిది? ఎలా పనిచేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 7, 2026, 07:30:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజన్స్​ రోజురోజుకు ఉద్యోగులను భయపెడుతున్న తరుణంలో మారో సంచలనం చోటుచేసుకుంది! ఏఐ ఇప్పుడు మనుషులను రిక్రూట్​ చేసుకుంటోంది. అవును మీరు విన్నది నిజమే! ఏఐని ట్రైన్​ చేసే దశ నుంచి ఇప్పుడు అదే ఏఐ మనిషిని రిక్రూట్​ చేసుకునే స్టేజ్​కి ఈ ప్రపంచం వచ్చేసింది.ఏఐ ఏజెంట్లు తమకు చేతకాని పనులు (అంటే భౌతిక ఉనికి అవసరమైనవి లేదా మనుషుల తీర్పు అవసరమైన పనులు) పూర్తి చేయడానికి మనుషులను నియమించుకునే ఒక మార్కెట్‌ప్లేస్ తాజాగా పుట్టుకొచ్చింది. అదే RentAHuman.ai.

రెంట్​ ఏ హ్యూమన్​ వెబ్​సైట్​.. (Rentahuman.ai)
రెంట్​ ఏ హ్యూమన్​ వెబ్​సైట్​.. (Rentahuman.ai)

త్రిష సెన్​గుప్తా​ అనే మహిళ​.. ఈ వెబ్​సైట్​ని ఉపయోగించారు. అనంతరం తన ఎక్స్​పీరియెన్స్​ని షేర్​ చేశారు. ఆమె చెప్పినది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంది?

ఏఐ వెబ్‌సైట్​లో యూజర్ జర్నీని అర్థం చేసుకోవడానికి త్రిష ముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉంది:

ఆమె తన జీమెయిల్​ ఖాతాను ఉపయోగించి లాగిన్ అయ్యారు.

లాగిన్ అయిన తర్వాత ఒక డ్యాష్‌బోర్డ్ ఓపెన్ అయ్యింది. అక్కడ ఆమె తన పేరు, బయో, ప్రాంతం, నైపుణ్యాలు, తన సోషల్ మీడియా లింకులు (ఎక్స్​, లింక్డ్​ఇన్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​) వంటి వివరాలను ఫిల్​ చేశారు.

ఒప పనికి గంటకు ఎంత ఛార్జ్ చేస్తారో కూడా అక్కడ నమోదు చేశారు. (ప్రస్తుతం అక్కడ కేవలం యూఎస్​డీ కరెన్సీ మాత్రమే అందుబాటులో ఉంది.)

వెరిఫైడ్ స్టేటస్: అభ్యర్థులు నెలకు 9.99 డాలర్లు చెల్లించి వెరిఫైడ్ స్టేటస్ పొందవచ్చు. దీని కోసం క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల యూజర్‌కు "బ్లూ చెక్‌మార్క్ + ప్రయారిటీ లిస్టింగ్" లభిస్తుంది.

పేమెంట్ ఎలా జరుగుతుంది?

ఈ సైట్‌లో పని చేసినందుకు మనుషులకు చెల్లింపులు అందాలంటే క్రిప్టో వాలెట్ కనెక్ట్ చేయడం తప్పనిసరి. ఏఐ ఏజెంట్లు కేవలం బిట్‌కాయిన్ లేదా ఎథెరియం (రూపంలో మాత్రమే వాలెట్ ఆధారిత చెల్లింపులు చేస్తాయి.

ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి?

రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత త్రిష​ "ఏఐ టాస్క్స్​" సెక్షన్‌ను పరిశీలించారు.

ఎక్కువగా అమెరికాకు చెందిన పనులు ఉన్నాయి. ఉదాహరణకు: కొన్ని నిర్దిష్ట పదాలు రాసి ఉన్న బోర్డులను పట్టుకుని నిలబడటం వంటివి.

పరిశోధన అధ్యయనాలకు సంబంధించిన పనులు కూడా ఉన్నాయి.

అన్నిటికంటే ఆసక్తికరమైన జాబ్: "ఛీజ్ రుచి ఎలా ఉంటుందో నాకు (ఏఐకి) చెప్పాలి". దానికి ఆమె అప్లై చేశారు!

డిజిటల్ సూచనలకు, భౌతిక ఫలితాలకు మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఒక ఏఐ ఇలా మనుషులను రిక్రూట్​ చేసుకుంటుండటం నిజంగా ఒక వింత అనుభవం అని అలెక్స్​ అంటున్నారు.

ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి?

చాలా వరకు పోస్టింగ్‌లు అమెరికా నుంచే ఉన్నాయి. కానీ కొన్ని పనులు రిమోట్‌గా (ఎక్కడి నుంచైనా) చేయవచ్చు. పాకిస్థాన్​ నుంచి కూడా కొన్ని పోస్టింగ్‌లు ఉండగా, ఇండియా నుంచి కేవలం పూణెలో మాత్రమే ఒక జాబ్ పోస్టింగ్ ఉంది.

ఈ సైట్‌ని ఎవరు సృష్టించారు?

ఈ rentahuman.ai సైట్​ని క్రిప్టో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అలెగ్జాండర్ లైటెప్లో రూపొందించారు. ఫిబ్రవరి 3న ఆయన ఒక ట్వీట్ చేస్తూ.. "నేను నిన్న రాత్రే rentahuman.ai ని లాంచ్ చేశాను అప్పుడే ఒక ఓఎఫ్ మోడల్, ఏఐ స్టార్టప్ సీఈఓతో సహా 130 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు," అని పేర్కొన్నారు.

మరి త్రిషకు ఉద్యోగం దొరికిందా?

ప్రస్తుతానికి ఆమెకు ఇంకా ఎవరూ పని ఇవ్వలేదు. కానీ ఈ సైట్‌ను పరిశీలించడం వల్ల ఏఐ అనేది కేవలం ఒక ఊహ కాదని, అది మన ప్రపంచాన్ని, పని చేసే విధానాన్ని ఎలా మారుస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అనిపించిందని ఆమె వివరించారు.

“మొదట్లో ఇది ఒక వ్యంగ్య వెబ్‌సైట్ (సెటైర్​) ఏమో అని నాకు కూడా అనిపించింది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలను బట్టి చూస్తే, ఇది ఒక సరికొత్త లేబర్ మార్కెట్‌కు ఆరంభంలానే కనిపిస్తోంది,” అని ఆమె అభిప్రాయపడ్డారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More