బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు- ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు..
బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofindia.bank.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025- ముఖ్యమైన తేదీలు..
బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రిస్మస్ రోజున, అంటే డిసెంబర్ 25న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 10, 2026 వరకు గడువు ఇచ్చారు.
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హత ఉన్న వారు త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
- SSC Constable GD Recruitment : 25,487 ప్రభుత్వ ఉద్యోగాలు.. 10 పాసైతే చాలు- దరఖాస్తుకు చివరి తేదీ సహా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025- అర్హత ప్రమాణాలు..
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తేదీ 01.04.2021- 01.12.2025 మధ్యలో ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. అభ్యర్థులు 02.12.1997 కంటే ముందు, 01.12.2005 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి.
పరీక్ష సమయం 90 నిమిషాలు.
భాషా పరీక్ష: రాత పరీక్షలో పాస్ అయిన వారికి స్థానిక భాషపై పట్టు ఉందో లేదో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో విఫలమైతే అప్రెంటిస్‌షిప్‌కు అనర్హులుగా ప్రకటిస్తారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్- స్టైఫండ్..
బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్లో ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ. 13వేల స్టైఫండ్ లభిస్తుంది. ఇందులో బ్యాంకు రూ. 8,500 ఇస్తుంది. ప్రభుత్వం నుంచి రూ. 4,500 మద్దతు ఇస్తుంది. అయితే స్టైఫండ్‌తో పాటు అదనపు ప్రయోజనాలు, అలొవెన్స్లు కూడా ఉంటాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్- ఫీజు..
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ అభ్యర్థులకు: రూ. 800 + జీఎస్‌టీ.
- ఎస్సీ / ఎస్టీ / మహిళా అభ్యర్థులకు: రూ. 600 + జీఎస్‌టీ.
- దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ): రూ. 400 + జీఎస్‌టీ.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్‌ను చదువుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


