SSC Constable GD Recruitment : 25,487 ప్రభుత్వ ఉద్యోగాలు.. 10 పాసైతే చాలు- దరఖాస్తుకు చివరి తేదీ..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కానిస్టేబుల్ జీడీ 2026 నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. పదివ తరగతి అర్హతతో కేంద్ర బలగాల్లో 25,487 పోస్టుల భర్తీకి ఈ దఫా రిక్రూట్మెంట్ జరగనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఒక ముఖ్యమైన సూచన జారీ చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి రిజిస్ట్రేషన్ గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 31, 2025 లోపు తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2026- చివరి నిమిషం వరకు ఆగవద్దు!
చివరి రోజుల్లో వెబ్‌సైట్‌పై ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల లాగిన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. "సర్వర్ నెమ్మదించడం లేదా సాంకేతిక ఇబ్బందుల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయే ప్రమాదం ఉంది. అందుకే అభ్యర్థులు ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి" అని ఎస్ఎస్సీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2026- ఖాళీల వివరాలు ఇవే:
మొత్తం 25,487 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటి విభజన ఇలా ఉంది:
సీఐఎస్‌ఎఫ్: 14,595 పోస్టులు
సీఆర్పీఎఫ్: 5,490 పోస్టులు
ఎస్ఎస్బీ: 1,764 పోస్టులు
అస్సాం రైఫిల్స్ (ఏఆర్): 1,706 పోస్టులు
ఐటీబీపీ: 1,293 పోస్టులు
బీఎస్ఎఫ్: 616 పోస్టులు
ఎస్ఎస్‌ఎఫ్: 23 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి అభ్యర్థులు జనవరి 1, 2026 నాటికి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
- రూ. 21లక్షల వరకు ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్.. అప్లికేషన్‌కి ఇంకా 2 రోజులే ఛాన్స్! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2026- దరఖాస్తు విధానం..
స్టెప్ 1- ముందుగా ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in సందర్శించండి.
స్టెప్ 2- 'Login' లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
స్టెప్ 3- రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్ నింపండి.
స్టెప్ 4- నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి.
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2026- ఫీజు వివరాలు..
దరఖాస్తు రుసుము రూ.100 మాత్రమే. అయితే, మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు (ఈఎస్ఎం) ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఎస్ఎస్సీ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


