రూ. 21లక్షల వరకు ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్.. అప్లికేషన్‌కి ఇంకా 2 రోజులే ఛాన్స్
ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారి కోసం ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌ని కొనసాగిస్తోంది. భారీ పే ప్యాకేజీతో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. అప్లికేషన్‌కి ఇంకా రెండు రోజులే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సాఫ్ట్‌వేర్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని చూస్తున్న వారికి కీలక అప్డేట్. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కి సంబంధించిన ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ 2025 ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మల్టీనేషనల్ కంపెనీలో అడుగుపెట్టేందుకు మీకు ఇదే సరైన అవకాశం. 2025 పాసౌట్ బ్యాచ్ వారికోసం ప్రత్యేకంగా జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ 2025- పోస్టులు, జీతాలు..
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు ఆకర్షణీయమైన శాలరీ ప్యాకేజీలను ఇన్ఫోసిస్ ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా 'స్పెషలిస్ట్ ప్రోగ్రామర్' వంటి పోస్టులకు కళ్లు చెదిరే ప్యాకేజీలు ఇస్తోంది. అవి..
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్3 (ట్రైనీ): ఏడాదికి రూ. 21 లక్షల ప్యాకేజీ.
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్2 (ట్రైనీ): ఏడాదికి రూ. 16 లక్షల ప్యాకేజీ.
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్1 (ట్రైనీ): రూ. 10 లక్షల ప్యాకేజీతో పాటు రూ. 1 లక్ష జాయినింగ్ బోనస్.
డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 6.25 లక్షల ప్యాకేజీతో పాటు రూ. 75,000 జాయినింగ్ బోనస్.
టెక్నికల్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, రియల్ టైమ్ ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్న వారికి ఈ హోదాలు చక్కగా సరిపోతాయి.
ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ 2025- అర్హత ప్రమాణాలు..
ఈ డ్రైవ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి:
బీఈ / బీటెక్,
ఎంఈ / ఎంటెక్,
ఎసీఏ లేదా ఎంఎస్సీ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్).
అర్హత కలిగిన బ్యాచ్: కేవలం 2025లో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల్లో ఆంధ్ర వారే ఎక్కువ! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ 2025- దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇన్ఫోసిస్ అధికారిక అప్లికేషన్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు స్వయంగా ఫారమ్ నింపాల్సి ఉంటుంది. మీరు అందించిన వివరాల ఆధారంగా ఇన్ఫోసిస్ టీమ్ దరఖాస్తులను స్క్రీనింగ్ చేస్తుంది. ఆపై అర్హులను తదుపరి రౌండ్లకు ఎంపిక చేస్తుంది.
కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ గురువారం, డిసెంబర్ 25, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్లికేషన్‌కి ఇంకా రెండు రోజుల అవకాశం మాత్రమే ఉంది.
ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐటీ ఇండస్ట్రీలో బలమైన పునాది వేయాలనుకునే ప్రతిభావంతులైన యువతకు ఇదొక సువర్ణావకాశం. మెరుగైన శిక్షణ, మంచి పని వాతావరణం, దీర్ఘకాలిక కెరీర్ వృద్ధిని ఇన్‌ఫోసిస్ అందిస్తోంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


