ఓపెన్ టెన్త్, ఇంటర్ అభ్యర్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజు తేదీలివే
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

పరీక్ష ఫీజు తేదీలివే…
ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజుల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 26 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు. రూ.25 ఫైన్‌తో (ఒక్కో పేపర్‌కు) ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు, రూ.50 ఫైన్‌తో (ఒక్కో పేపర్‌కు) జనవరి 3 నుంచి 7 వరకు ఫీజు వరకు అవకాశం ఉంటుంది. ఈ ఫీజులను https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చు.
మరోవైపు తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చింది. అడ్మిషన్ల గడువును డిసెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు.ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫీజులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని…. పూర్తి వివరాలకు 93460 20003 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు..తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆధార్ , మొబైల్ నెంబర్ కరెక్ట్ గా నమోదు చేసుకోవాలి. https://www.telanganaopenschool.org/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. స్టడీ సెంటర్లను సరిగా చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అడ్మిషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నఅప్లికేషన్ ఫామ్ ను స్టడీ సెంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

