ఓఎన్​జీసీ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​- ఇలా అప్లై చేసుకోండి..

ఓఎన్​జీసీ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025 అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​! అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్​మెంట్​కి ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 17, 2025, 11:20:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్​జీసీ) అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను నేటితో ముగించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్ ongcapprentices.ongc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓఎన్​జీసీ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025
ఓఎన్​జీసీ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025

ఈ నియామక ప్రక్రియ ద్వారా సంస్థలో మొత్తం 2743 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఓఎన్​జీసీ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025- అర్హతలు, వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు నవంబర్ 6, 2025 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు 06.11.2001- 06.11.2007 మధ్య జన్మించి ఉండాలి.

విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో చూడగలరు. ఓఎన్​జీసీ అధికారిక వెబ్​సైట్​లో నోటిఫికేషన్​ అందుబాటులో ఉంటుంది.

ఓఎన్​జీసీ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025- ఎంపిక ప్రక్రియ

ఓఎన్​జీసీ అప్రెంటిస్‌ రిక్రూట్​మెంట్​ 2025 ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ప్రకటనలో నిర్దేశించిన క్వాలిఫైయింగ్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

మెరిట్‌లో ఒకే సంఖ్యలో మార్కులు వచ్చిన సందర్భంలో, ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంటారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫారసు లేదా ప్రభావితం చేసే ప్రయత్నాలను అంగీకరించరు. అలాంటి సందర్భాలలో దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చు.

ఓఎన్‌జీసీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025: దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన సూచనలను పాటించండి:

స్టెప్​ 1- ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్ ongcindia.com ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న “ONGC Apprentice Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది.

స్టెప్​ 4- మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి, ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.

స్టెప్​ 5- దరఖాస్తు ఫీజు చెల్లించండి (వర్తిస్తే).

స్టెప్​ 6- సబ్మీట్​ బటన్‌పై క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 7- భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు హార్డ్ కాపీని మీ వద్ద భద్రపరుచుకోండి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌ను తప్పకుండా తనిఖీ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More