Raakaasa Review: బలి కోరే కోటలోని రాక్షసుడు..నవ్వించే హారర్ థ్రిల్లర్.. సంగీత్ శోభన్ రాకాస ఎలా ఉంది? నిహారికకు మరో హిట్?

Raakaasa Review: హారర్ ప్లస్ కామెడీ జోనర్ అంటే క్రేజే వేరు. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను నవ్విస్తూనే భయపెడతాయి. మరి అదే జోనర్ లో ఈ రోజు రిలీజైన రాకాస ఎలా ఉంది? ప్రొడ్యూసర్ గా మెగా డాటర్ మరో హిట్ కొట్టిందా? అన్నది రాకాస రివ్యూలో చూసేయండి. 

Published on: Apr 3, 2026, 11:30:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా పేరు : రాకాస

రాకాస రివ్యూ (x)
రాకాస రివ్యూ (x)

నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను తదితరులు

డైరెక్టర్ : మానస శర్మ

ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్

మ్యూజిక్ : అనుదీప్ దేవ్

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 3, 2026

‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రొడ్యూసర్ గా ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె నిర్మించిన రెండో సినిమా ‘రాకాస’. హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (ఏప్రిల్ 3) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హారర్ కామెడీ జోనర్ కలిసొచ్చిందా? అన్నది రాకాసా రివ్యూలో చూసేయండి.

రాకాస స్టోరీ

అది రంకవరం గ్రామం. అక్కడో భయంకరమైన పురాతన కోట. అందులో ఓ బ్రహ్మ రాక్షసుడు. ఆ రాక్షసుడు వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి ఒక మనిషిని బలిగా పంపే ప్రజలు. ఇందులో చిక్కుకున్న హీరో.. క్లుప్తంగా ఇదే రాకాస సినిమా స్టోరీ.

వీరబాబు (సంగీత్ శోభన్) అమెరికా నుంచి సొంత ఊరికి వస్తాడు. తన చిన్ననాటి ప్రియురాలు కోసం వెతుకుతాడు. కానీ ఆమె దూరమవుతుంది. ఆ పరిస్థితుల్లో సుబ్బలక్ష్మి (నయన్ సారిక) అతనికి దగ్గరవుతుంది. ఆ గ్రామంలో సోము (వెన్నెల కిశోర్) హత్యకు గురవుతాడు. ఈ కేసులో వీరబాబు ఇరుక్కుంటాడు.

అనుకోని పరిస్థితుల్లో కోటలోని రాక్షసుడికి బలిగా వీరబాబు వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాక్షసుడి కథ ఏంటీ? వీరబాబు ప్రాణాలతో బయటపడ్డాడా? అన్నదే రాకాస మూవీ స్టోరీ.

విశ్లేషణ

అందమైన చందమామ కథకు హారర్, కామెడీ టచ్ ఇచ్చి రాకాస సినిమాను తెరకైకి తీసుకొచ్చింది లేడీ డైరెక్టర్ మానస శర్మ. తన ఫస్ట్ సినిమాతోనే ఆమె అటెంప్ట్ ప్రశంసలు అందుకుంటుంది. హాయిగా నవ్వించే కామెడీ, అక్కడక్కడా భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ తో కలిసి రాకాస ఓ ఫన్ రైడ్ లా సాగిపోతుంది.

రాక్షసుడిని పరిచయం చేస్తూ సినిమా మొదలెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. వీరబాబు ఎంట్రీతో కామెడీ జోరందుకుంటుంది. ఫస్టాఫ్ లో గెటప్ శ్రీను, సెకండాఫ్ లో వెన్నెల కిశోర్ తో కలిసి సంగీత్ శోభన్ చేసిన కామెడీ సినిమాను నిలబెట్టింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.

అయితే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఈ కాలంలోనూ కోటలు, రాక్షసులు, నరబలి అనేది లాజిక్ కు దూరంగా అనిపిస్తుంది. కానీ లాజిక్ లు పక్కనపెట్టి చూస్తే రాకాస సినిమా ఫుల్ టైమ్ పాస్ మూవీ.

ఎవరెలా చేశారంటే?

రాకాస సినిమాలో సంగీత్ శోభన్ యాక్టింగ్ హైలైట్. తనదైన కామెడీ టైమింగ్ తో అతను సినిమాను నడిపించాడు. సోలో హీరోగా ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. అతను స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా కామెడీ పేలింది.

వెన్నెల కిశోర్, గెటప్ శ్రీనులతో కలిసి సంగీత్ కామెడీ ఈ సినిమాకు అతిపెద్ద బలం. నయన సారిక తన పాత్రను సమర్థంగా పోషించింది. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీమ్

లేడీ డైరెక్టర్ మానస శర్మ ఫస్ట్ సినిమాతోనే హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. సూపర్ హిట్ జానర్ అయిన హారర్ ప్లస్ కామెడీని నమ్ముకున్న ఆమె ఈ రాకాస మూవీని నీట్ గా తెరకెక్కించింది. ఎక్కడా అనవసరమైన కన్ఫ్యూజన్ ఉండదు. విఠలాచార్య తరహా సోషియో ఫాంటసీగా రాకాస ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

హారర్ సినిమాల్లో బీజీఎం కీలకం. ఈ రాకాస మూవీకి అనుదీప్ దేవ్ తన మ్యూజిక్ తో మరింత ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఇక ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గురించి చెప్పుకోవాలి. లిమిటెడ్ బడ్జెట్ లోనే గ్రాండ్ లెవెల్ లో తాను అనుకున్న విధంగా, తెరపై గొప్పగా కనిపించేలా రాకస సినిమాను నిర్మించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రిలీజ్ కు ముందు ప్రచారాన్ని గట్టిగా నిర్వహించి అందరూ రాకాస గురించి మాట్లాడుకునేలా చేసింది.

ఫైనల్ గా

లాజిక్ లు పక్కనపెట్టి వేసవిలో కుటుంబం అంతా కలిసి హాయిగా, కడుపుబ్బా నవ్వుకోవాలనుకునే వాళ్లకు రాకాస మంచి ఆప్షన్. ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ మూవీ అలా సాగిపోతుంది. ఫన్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుంది.

రేటింగ్: 3.25/5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More