Rakasa Trailer: హారర్ అడ్వెంచర్ కామెడీ కలిస్తే రాకాస.. నవ్విస్తూ భయపెడుతున్న సంగీత్ శోభన్ మూవీ ట్రైలర్

Rakasa Trailer: సంగీత్ శోభన్ లీడ్ రోల్లో నటిస్తున్న రాకాస మూవీ ట్రైలర్ వచ్చేసింది. బుధవారం (మార్చి 25) రిలీజైన ఈ ట్రైలర్ నవ్విస్తూ భయపెడుతూ చాలా సరదాగా సాగిపోయింది. సంగీత్ మార్క్ ఫన్నీ డైలాగులు, భయపెట్టే సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

Published on: Mar 25, 2026, 18:56:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rakasa Trailer: నిహారిక కొణిదెల నిర్మిస్తున్న తెలుగు హారర్ ఫ్యాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇది ఎంతో ఆసక్తికరంగా సాగి.. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ ట్రైలర్ విశేషాలేంటో చూడండి.

Rakasa Trailer: హారర్ అడ్వెంచర్ కామెడీ కలిస్తే రాకాస.. నవ్విస్తూ భయపెడుతున్న సంగీత్ శోభన్ మూవీ ట్రైలర్
Rakasa Trailer: హారర్ అడ్వెంచర్ కామెడీ కలిస్తే రాకాస.. నవ్విస్తూ భయపెడుతున్న సంగీత్ శోభన్ మూవీ ట్రైలర్

రాకాస ట్రైలర్ ఇలా..

రాకాస ట్రైలర్ మొదట్లోనే బ్రహ్మరాక్షసుడి పరిచయంతో మొదలవుతుంది. ఆ రాక్షసుడికి ఊరు ఓ బలిని పంపుతుందన్న వాయిస్ ఓవర్ వినొచ్చు. ఆ తర్వాత ట్రైలర్ సడెన్ గా కామెడీ వైపు మళ్లుతుంది. ఓ పల్లెటూరికి వచ్చే హీరో అక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం, అనుకోకుండా అక్కడి బ్రహ్మరాక్షసుడు ఉన్న కోటలో చిక్కుకోవడం.. ఇలా సాగిపోతుంది ట్రైలర్.

మధ్యలో సంగీత్ శోభన్ మార్క్ డైలాగులు, కామెడీ ఆకట్టుకున్నాయి. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ సరదాగా సాగిపోయింది. చివర్లో తనను తాను ఓ సూపర్ హీరోగా సంగీత్ ఫీలయ్యే సీన్ తో ట్రైలర్ ముగియడం మరింత ఆకర్షించింది.

కామెడీ హారర్ ఫాంటసీ మూవీగా రాకాస

తెలుగులో కామెడీ హారర్ ఫాంటసీ చిత్రంగా రాకాస తెరకెక్కింది. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు నిహారిక కొణిదెల. ఈ రాకాస సినిమాకు ఓటీటీ సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్న మానస శర్మ దర్శకత్వం వహించారు.

మ్యాడ్, మ్యడ్ స్క్వేర్ సినిమాల్లో కామెడీ టైమింగ్‌తో అలరించిన సంగీత్ శోభన్ రాకాస మూవీలో హీరోగా చేస్తున్నాడు. అంతేకాదు సంగీత్ శోభన్ సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ మూవీలో సంగీత్ శోభన్‌కు జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. ఈ ఇద్దరితోపాటు రాకాసలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇక తాజాగా రాకాస మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. నిర్మాతగా మారిన తర్వాత ఓ సాంగ్‌లో నిహారక కొణిదెల డ్యాన్స్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. రాకాస మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More