Sangeeth Sobhan: మ్యాడ్‌లాంటి మూవీ చేసే గట్స్ వంశీకి మాత్రమే ఉన్నాయి.. మ్యాడ్ స్క్వేర్ చేయాల్సింది కాదు: సంగీత్ శోభన్

Sangeeth Sobhan: సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే అతడు రాకాస అనే మూవీతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 7, 2026, 11:15:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంగీత్ శోభన్.. ఈ టాలీవుడ్ యువ హీరో చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్ ఆడియెన్స్ లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు సంగీత్ ను ఓ స్టార్ ను చేశాయి. అయితే తనకు గనుక ఛాయిస్ ఇచ్చి ఉంటే మ్యాడ్ స్క్వేర్ చేసేవాడిని కాదని అతడు అనడం గమనార్హం.

Sangeeth Sobhan: మ్యాడ్‌లాంటి మూవీ చేసే గట్స్ వంశీకి మాత్రమే ఉన్నాయి.. మ్యాడ్ స్క్వేర్ చేయాల్సింది కాదు: సంగీత్ శోభన్
Sangeeth Sobhan: మ్యాడ్‌లాంటి మూవీ చేసే గట్స్ వంశీకి మాత్రమే ఉన్నాయి.. మ్యాడ్ స్క్వేర్ చేయాల్సింది కాదు: సంగీత్ శోభన్

"మరింత భిన్నంగా చేసి ఉండాల్సింది"

తాజాగా Gulte.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మ్యాడ్ స్క్వేర్' గురించి సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. "మ్యాడ్ (Mad) సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత, నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉండిపోయాను. మ్యాడ్ స్క్వేర్‌ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేశాం. నిర్మాత నాగవంశీ అన్న కూడా ఇదే విషయాన్ని ఫీలయ్యారు" అని పేర్కొన్నాడు.

అంతేకాకుండా.. "ఈ సినిమాలో క్రైమ్-కామెడీ ట్రాక్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ కథలో రిస్క్ పెంచి ఉంటే అవుట్‌పుట్ మరోలా ఉండేది. అయితే మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ బాగుందని అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం మనం ఏదైనా కొత్తగా ప్రయత్నించి ఉండాల్సింది అనిపిస్తుంది" అని సంగీత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

వంశీ అన్న కాబట్టే మ్యాడ్ చేశాడు

ఇక మ్యాడ్ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి కూడా సంగీత్ చాలా గొప్పగా చెప్పాడు. అసలు మ్యాడ్ లాంటి మూవీ చేసే దమ్మున్న ప్రొడ్యూసర్ వంశీ అన్న మాత్రమే అని అతడు అనడం విశేషం. చాలా మంది వంశీ గురించి ఏవేవో కామెంట్స్ చేస్తారని, కానీ అది నిజం కాదని చెప్పాడు. మ్యాడ్ లాంటి మూవీని మరెవరో తీయరని, వంశీ అన్న కాబట్టే తీశాడని సంగీత్ స్పష్టం చేశాడు.

వరుస సినిమాలతో సంగీత్ సందడి

వరుస హిట్స్ అందుకుంటున్న సంగీత్ శోభన్.. 'రాకాస' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో అతని మార్క్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

ఈ వ్యాఖ్యలతో అతడు తన సినిమాల పట్ల ఎంతటి నిజాయితీగా, విశ్లేషణాత్మకంగా ఉంటారో అర్థమవుతోంది. రాకాస మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More