OTT Horror: ఓటీటీలోకి వచ్చిన కామెడీ హారర్ థ్రిల్లర్- దెయ్యాల ఊరిలో మేయర్ కష్టాలు- 100 శాతం ఫ్రెష్ కంటెంట్, 7.7 రేటింగ్!
OTT Horror Comedy Series Widow's Bay: హారర్ కామెడీ జోనర్‌లో మరో క్రేజీ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను పలకరించింది. హాలీవుడ్ నటుడు మాథ్యూ రైస్ ప్రధాన పాత్రలో నటించిన విడోస్ బే ఓటీటీ రిలీజ్ అయింది. దెయ్యాల ఊరిలో పడ్డ మేయర్ కష్టాలతో ఈ సిరీస్ సాగుతుంది. మరి విడోస్ బే ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Widows Bay OTT Streaming: నవ్వుకు భయం తోడైతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే కాన్సెప్ట్‌తో ఓటీటీలోకి కామెడీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దెయ్యాల ఊరిలో పడే ఓ మేయర్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడన్నదే దీని కథ. ఆ ఓటీటీ సిరీస్ పేరే 'విడోస్ బే' (Widow’s Bay).

అతీంద్రియ శక్తుల ద్వీపం
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉండే ఒక వింతైన, అతీంద్రియ శక్తులు ఉన్న ద్వీపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మూఢనమ్మకాలు, దెయ్యాల కథలు ఎక్కువగా ఉండే ఈ ఊరికి మేయర్‌గా బాధ్యతలు చేపడతాడు టామ్ లాఫ్టిస్ (మాథ్యూ రైస్).
పర్యాటక కేంద్రంగా మార్చాలని
ఒకవైపు ఊరి సమస్యలను పరిష్కరిస్తూనే, మరోవైపు ఆ వింత ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆయన చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే వింత అనుభవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హారర్, మిస్టరీ, థ్రిల్లర్‌తోపాటు డార్క్ హ్యూమర్ (Dark Humor) ఇష్టపడే వారికి ఈ ఓటీటీ సిరీస్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.
100 శాతం ఫ్రెష్ కంటెంట్
అంతేకాకుండా విడోస్ బే సిరీస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సిరీస్‌కు రొటెన్ టోమాటోస్ సంస్థ నుంచి ఏకంగా 100కు 100 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో ఈ వెబ్ సిరీస్‌కు పదికి 7.7 రేటింగ్ ఉంది. అంటే, విడోస్ బే ఓటీటీ సిరీస్‌లో ఉన్న కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు-ఎపిసోడ్ షెడ్యూల్
ఇలాంటి విడోస్ బే ఓటీటీలోకి నిన్న (ఏప్రిల్ 29) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV Plus)లో విడోస్ బే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 29న ఆపిల్ ప్లస్ టీవీలో విడోస్ బే నుంచి రెండు ఎపిసోడ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్‌లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి బుధవారం ఒక కొత్త ఎపిసోడ్ ఓటీటీ ప్రీమియర్ అవుతుంది.
విడోస్ బే ఓటీటీ సిరీస్ ఎపిసోడ్స్ రిలీజ్ వివరాలు ఇలా:
ఎపిసోడ్ 1, 2: ఏప్రిల్ 29 (ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి)
ఎపిసోడ్ 3 (Inaugural Swim): మే 6
ఎపిసోడ్ 4 (Beach Reads): మే 13
ఎపిసోడ్ 5 (What to Expect on Your Trip): మే 20
ఎపిసోడ్ 6 & 7: మే 27
ఎపిసోడ్ 8 (Your Baggage): జూన్ 3
ఎపిసోడ్ 9 (Emergency Shelter): జూన్ 10
ఎపిసోడ్ 10 (Grand Finale): జూన్ 17
ఎందుకు చూడాలి?
మాథ్యూ రైస్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. ఒక మేయర్‌గా ఆయన పడే ఇబ్బందులు, ద్వీపంలో జరిగే వింత సంఘటనల మధ్య కామెడీని పండించిన తీరు మెప్పిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు 'మసూద' లేదా 'ఓం భీమ్ బుష్' వంటి సినిమాల్లో కనిపించే హారర్-కామెడీ మిశ్రమం ఇక్కడ వెస్ట్రన్ స్టైల్‌లో కనిపిస్తుంది. కేవలం భయపెట్టడమే కాకుండా, పర్యాటక రంగం వెనుక ఉండే రాజకీయాలను కూడా వ్యంగ్యంగా చూపించారు.
మరో ఓటీటీలో కూడా
జూన్ మధ్య వరకు సాగే ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణం, హారర్ ప్రేమికులను అలరిస్తుందని చెప్పొచ్చు. మీకు ఆపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే ఈ వారాంతంలో ఈ ఓటీటీ సిరీస్‌ను చూసేయొచ్చు. లేదా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో విడోస్ బే వెబ్ సిరీస్‌ను వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


