Band Melam: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్యాండ్ మేళం.. బ్లాక్ బస్టర్ జోడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Band Melam: లేటెస్ట్ తెలుగు యూత్ లవ్ స్టోరీ ‘బ్యాండ్ మేళం’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో బ్లాక్ బస్టర్ జోడీ రోషన్, శ్రీదేవి మరోసారి కెమిస్ట్రీతో మెప్పించారు.
Band Melam: కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ సినిమాలో మరోసారి వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

బ్యాండ్ మేళం ఓటీటీ
లేటెస్ట్ తెలుగు యూత్ మూవీ ‘బ్యాండ్ మేళం’ డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 24 నుంచి జీ5 తెలుగు ఓటీటీలో బ్యాండ్ మేళం సినిమా ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ శుక్రవారం (ఏప్రిల్ 17) పోస్టర్ షేర్ చేసింది.
‘‘బ్లాక్ బస్టర్ పెయిర్ మళ్లీ రాబోతుంది. మీరు మెచ్చిన జంట మరోసారి దరువు వేయబోతుంది. రిథమ్ కు మీరు రెడీనా? ఏప్రిల్ 24న బ్యాండ్ మేళం ప్రీమియర్ కేవలం జీ5లో మాత్రమే’’ అని జీ5 తెలుగు ఎక్స్ లో పోస్టు చేసింది.
థియేటర్ రెస్పాన్స్
బ్యాండ్ మేళం సినిమాకు థియేటర్లో మిక్స్ డ్ రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం మార్చి 26న థియేటర్లో రిలీజైంది. ఈ చిత్రానికి సతీశ్ జవ్వాజి డైైరెక్టర్. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కింద కావ్య, శ్రావ్య ఈ సినిమాను నిర్మించారు. బ్యాండ్ మేళం మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, గోపరాజు తదితరులు నటించారు.
బ్యాండ్ మేళం స్టోరీ
కోర్ట్ సినిమాతో మెప్పించిన రోషన్, శ్రీదేవి మరోసారి జత కట్టడంతో బ్యాండ్ మేళం మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో వాళ్లు బావమరదళ్లుగా నటించారు. యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి)కి పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి.
గిరికి మ్యూజిక్ అంటే ఇష్టం. రాజీ ఏమో టాపర్. వీళ్లిద్దరి మధ్య విభేధాలు వస్తాయి. ఊర్లో ఫ్రెండ్స్ తో కలిసి గిరి మ్యూజిక్ బ్యాండ్ పెడతారు. మరోవైపు పై చదువుల కోసం రాజీ సిటీకి వెళ్తుంది.
ఆ ట్విస్ట్
రాజీనే తనకు కాబోయే పెళ్లాం అని గిరి కలలు కంటుంటాడు. కానీ రాజీ తండ్రి సాయన్న (సాయి కుమార్) మాత్రం తన కూతురిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వేరే వాళ్లతో పెళ్లికి రాజీ ఒప్పుకుందా? యాదగిరి ఏం చేశాడు? అన్నది బ్యాండ్ మేళం సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


