Dhurandhar 2 OTT: ధురంధ‌ర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌లో ట్విస్ట్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో కాదు.. రిలీజ్ ఆల‌స్యం.. కార‌ణం ఇదే

Dhurandhar 2 OTT: రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి రావట్లేదు. మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. అంతే కాకుండా డిజిటల్ రిలీజ్ లేట్ అవుతుందని సమాచారం. 

Published on: Apr 9, 2026, 11:20:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’. థియేటర్లలో అదరగొడుతున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని డిజిటల్ స్ట్రీమింగ్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ధురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది.

ధురంధర్ 2లో రణ్‌వీర్ సింగ్ (Screengrab from YouTube/JioStudios)
ధురంధర్ 2లో రణ్‌వీర్ సింగ్ (Screengrab from YouTube/JioStudios)

ధురంధర్ 2 ఓటీటీ

ధురంధర్ 2 సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోనే వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ధురంధర్ మూవీ పార్ట్ 1 ఈ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ధురంధర్ 2 మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లోకి రావడం లేదన్నది తాజా సమాచారం. ఈ మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ మారిందని టాక్.

జియోహాట్‌స్టార్‌లో

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. థియేటర్లలో ఈ చిత్రం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేపథ్యంలో, దాని ఓటీటీ విడుదలపై ఆసక్తి పెరుగుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుందని బాలీవుడ్ హంగామా, పింక్‌విల్లా రిపోర్ట్స్ చెబుతున్నాయి.

ఓటీటీలో ఎప్పుడు?

ధురంధర్ 2 మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో కాదు జియోహాట్‌స్టార్‌లో రిలీజ్ కానుందని తెలిసింది. అయితే ఓటీటీ రిలీజ్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు. ఒకటేమో ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ రన్ కాగా.. రెండోది ఐపీఎల్ 2026.

మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 మూవీ ఇప్పటికీ థియేటర్లలో బాగా ఆడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఐపీఎల్ 2026కు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మే చివరి వారంలో లేదా జూన్ ప్రారంభంలో మూవీ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రావచ్చు.

డబుల్ రేట్

ధురంధర్ 2 సినిమా ఓటీటీ రైట్స్ కోసం అదిరే రేట్ పలికినట్లు సమాచారం. ఈ మూవీ డిజిటల్ హక్కులను రూ.150 కోట్లకు జియోహాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ధురంధర్ పార్ట్ 1 ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ గతంలో రూ.85 కోట్లు చెల్లించింది.

“ఫస్ట్ పార్ట్ రిలీజ్ కావడానికి ముందే ధురంధర్ రెండు భాగాల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.175 కోట్ల డీల్ చేయాలనుకుంది. కానీ అప్పుడు జియోస్టూడియోస్ ఫస్ట్ పార్ట్ కు మాత్రమే ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు రెండో పార్ట్ కు రూ.150 కోట్ల రేట్ పలికింది’’ అని ఓ సోర్స్ చెప్పినట్లు సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More