OTT Horror: ఆహా అనిపించే తమిళ్ హారర్ థ్రిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్ లో మిస్టరీ మూవీ.. మీరు చూశారా?

OTT Horror: ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ అదరగొడుతోంది. మిస్టరీ ఎలిమెంట్స్ తో వేరే లెవల్ థ్రిల్ పంచుతోంది. ఓటీటీని షేక్ చేస్తూ, ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న ఈ మూవీని మీరు చూశారా? లేదంటే ఓ లుక్కేయండి.

Published on: Apr 5, 2026, 19:35:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ గ్రానీ.. వయసు మళ్లిన బామ్మ. కానీ ఆమె గతం ఎంతో భయంకరం. ఆమె చేసే పనులు వెన్నులో వణుకు పుట్టించేవే. చిన్నపిల్లల హత్యలు, శాపాలు ఇలా ఒక సినిమాలో ఎన్నో మలుపులు. ఇలాంటి అంశాలతో ఓటీటీలో అదరగొడుతున్న ఆ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు.. ‘గ్రానీ’. ఈ మిస్టరీ సస్పెన్స్ మూవీ రెండు ఓటీటీల్లోనూ సత్తాచాటుతోంది.

ఓటీటీ ట్రెండింగ్ లో తమిళ్ హారర్ థ్రిల్లర్ (x)
ఓటీటీ ట్రెండింగ్ లో తమిళ్ హారర్ థ్రిల్లర్ (x)

గ్రానీ ఓటీటీ

ఓటీటీలో తమిళ్ హారర్ థ్రిల్లర్ గ్రానీని ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ఈ సినిమా ఆహా వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీల్లోనూ ఈ హారర్ మూవీ అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

హారర్ థ్రిల్లర్

గ్రానీ సినిమా మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో వడివుకరాసి, సింగం పులి, దిలీపన్ తదితరులు నటించారు. ఈ మూవీకి విజయ్ కుమారన్ డైరెక్టర్.

గ్రానీ స్టోరీ

ఓ మిస్టీరియస్ బామ్మ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమానే గ్రానీ. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న తమ సొంతూరికి లండన్ నుంచి ఓ ఫ్యామిలీ వస్తుంది. ఆ గ్రామంలో వాళ్లకు వారసత్వంగా వచ్చిన పురాతన ఇల్లు ఉంటుంది.

లండన్ నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీకి ఆ ఇంట్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఓ బామ్మ వాళ్లను భయపెడుతుంది.

చిన్నారుల హత్యలు

మరోవైపు గ్రామంలో చిన్నారుల హత్యలు కలకలం రేపుతాయి. ఇదో పెద్ద మిస్టరీగా మారుతుంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తారు. అయితే ఆ బామ్మ గతం ఏంటీ? ఆ గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరిగింది? అన్నది గ్రానీ సినిమాలో చూడాల్సిందే.

ఎందుకు చూడాలంటే?

హారర్ సినిమాలంటే సస్పెన్స్ వేరే లెవల్ లో ఉండాలి. అదే రేంజ్ లో భయపెట్టాలి. గ్రానీ మూవీలో ఇవి రెండు పర్ఫెక్ట్ గా కుదిరాయనే కామెంట్లు వస్తున్నాయి. రూరల్ స్టోరీ లైన్ తో పాటు సైకలాజికల్ సస్పెన్స్, సూపర్ నేచురల్ హారర్ ఎలిమెంట్స్ తో గ్రానీ మూవీ ఎంగేజింగ్ గా సాగుతుంది.

మధ్యలో ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేస్తాయి. అసలు నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించలేకుండా వచ్చే సీన్లు వణికిస్తాయి. భయం, సస్పెన్స్, థ్రిల్ కావాలనుకునే ఆడియన్స్ గ్రానీ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. హారర్ థ్రిల్లర్ లవర్స్ కు గ్రానీ సినిమా ఓ మంచి ఆప్షన్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More