OTT Horror: ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. అడవిలో రాక్షసి.. అమ్మాయిని చిన్నపిల్లలా.. సస్పెన్స్!
OTT Horror: ఈ వారం ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వెన్నులో వణుకు పుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అడవిలోని ఈ రాక్షసి ఎవరు? ఎందుకు చంపుతుంది? అన్నది ఈ మూవీలో చూడాల్సిందే.
అడవిలో ముసుగు వెనుకాల ఉన్న రాక్షసి అక్కడికి వచ్చిన జనాలను అత్యంత క్రూరంగా చంపుతుంది. కన్న తండ్రిని కూడా వదలదు. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు.. ‘డాలీ’. ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఈ రోజు (ఏప్రిల్ 4) ఓటీటీలోకి వచ్చింది.

డాలీ ఓటీటీ
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘డాలీ’ ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డాలీ సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని ఇప్పుడు రెంట్ పే చేసి మాత్రమే చూడొచ్చు. ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ డాలీ సినిమా చూడాలంటే మనీ కట్టాల్సిందే.
తెలుగులోనూ
హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘డాలీ’ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో చూడొచ్చు. ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి.
హారర్ థ్రిల్లర్
డాలీ మూవీ ఓ హారర్ థ్రిల్లర్. ఇందులో సస్పెన్స్, సైకో తరహా అంశాలు కూడా ఉంటాయి. ఈ సినిమాకు రాడ్ బాక్ల్ హర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో ఫాబియానె థెరీసా, రస్ టిలర్, కేట్ కాబ్, ఈవ్ తదితరులు నటించారు.
డాలీ స్టోరీ
మేసీ, చేజ్ ఫ్రెండ్స్. ఓ రోజు అడవికి ట్రెక్కింగ్ కు వెళ్తారు. అక్కడ మేసీకి ప్రపోజ్ చేయాలని చేజ్ అనుకుంటాడు. అయితే ట్రెక్కింగ్ చేస్తూ వాళ్లు విడిపోతారు. అప్పుడే ఓ బొమ్మ ముసుగు వేసుకున్న ఓ వింత మహిళ డాలీ.. తల లేని శవాన్ని పూడ్చి పెట్టడం చేజ్ చూస్తాడు. చేజ్ ను డాలీ చంపాలనుకుంటుంది. అతనిపై దాడి చేస్తుంది.
చిన్నపిల్లలా
ఆ తర్వాత మేసీని డాలీ తన ఇంట్లో బంధిస్తుంది. మేసీని పెద్ద ఊయలలో వేసి చిన్నపిల్లలా చూసుకుంటుంది. చిత్రహింసలు పెడుతుంది. డాలీ తన సొంత తండ్రిని కూడా చంపుతుంది. మేసీ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేస్తుంది.
మేసీకి ఒక కీ దొరుకుతుంది. మరి మేసీ అక్కడి నుంచి తప్పించుకుందా? అసలు డాలీ ఎవరు? చేజ్ బతికే ఉన్నాడా? అనేది డాలీ మూవీ చూస్తే తెలుస్తుంది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ఫ్యాన్స్ కు ఈ డాలీ ఓ మంచి ఆప్షన్. ఇంకెందుకు లేట్, ఈ వీకెండ్ కు ఓ లుక్కేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


