OTT Horror: ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హారర్ థ్రిల్లర్.. 1714 కోట్ల సినిమా.. ట్విస్ట్ లకు మైండ్ బ్లాక్ అవాల్సిందే!

OTT Horror: ఓటీటీలోకి ఇవాళ ఓ వణికించే హారర్ థ్రిల్లర్ వచ్చింది. అదిరిపోయే ట్విస్ట్ లతో ఇది ఫుల్ థ్రిల్ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1714 కోట్లు కలెక్ట చేసిన ఈ మూవీని ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో చూసేయండి. 

Mar 31, 2026, 10:59:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన 'స్క్రీమ్' (Scream) ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మరో సంచలన సినిమా ‘స్క్రీమ్ 7’. ఇది థియేటర్లలో అదరగొట్టింది. ఈ సిరీస్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ (x)
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ (x)

స్క్రీమ్ 7 ఓటీటీ

హారర్ థ్రిల్లర్ మూవీ ‘స్క్రీమ్ 7’ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. ఈ ఇంగ్లీష్ మూవీ మంగళవారం (మార్చి 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీని రెంట్ పే చేసి చూడొచ్చు.

మరింత భయంకరంగా

ఈ సారి కథను మరింత భయంకరంగా, ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించినట్లు తెలుస్తోంది. గత సినిమాల్లో ప్రాణాలతో బయటపడిన సిడ్నీ ప్రెస్కాట్, ఇప్పుడు తన కూతురు టాటమ్‌ను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్రం.

బాక్సాఫీస్ హిట్

స్క్రీమ్ 7 మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో రిలీజైంది. రూ.378 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1714 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు కెవిన్ విలియమ్సన్ డైరెక్టర్. ఇందులో క్యాంప్ బెల్, ఇసాబెల్, జాస్మిన్, మేసన్ తదితరులు నటించారు.

అదిరే ట్విస్ట్ లు

స్క్రీమ్ 7 మూవీ కథ ప్రకారం, సిడ్నీ ప్రెస్కాట్ ఇప్పుడు ఒక కాఫీ షాప్ నడుపుకుంటూ ప్రశాంతంగా జీవిస్తోంది. అయితే, వుడ్స్‌బోరో హత్యల నిందితుడు స్టు మాచర్ తిరిగి వచ్చాడనే వార్తలతో కథ మలుపు తిరుగుతుంది. సిడ్నీ కూతురు టాటమ్‌ను టార్గెట్ చేస్తూ వరుస హత్యలు జరుగుతాయి.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ హత్యలు చేస్తోంది నిజమైన స్టు మాచర్ కాదు, డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీని వాడుతున్న ఒక ఐటీ ఎక్స్ పర్ట్ మార్కో, సిడ్నీ పక్కింటి ఆవిడ జెస్సికా అని తేలుతుంది.

ఘోస్ట్ ఫేస్

ఈ సినిమాలో కేవలం కత్తులతో దాడి చేయడమే కాకుండా, వీడియో కాల్స్ ద్వారా పాత విలన్ల ముఖాలను (ముఖ్యంగా డ్యూయీ రైలీ ముఖాన్ని) వాడుకుంటూ సిడ్నీని మానసిక వేదనకు గురిచేసే సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. పాత జ్ఞాపకాలను వాడుకుంటూ సిడ్నీ కూతురిని 'ఫైనల్ గర్ల్'గా మార్చాలనే విలన్ల కుట్ర ఉత్కంఠను కలిగిస్తుంది. చివరికి సిడ్నీ తన తెలివితేటలతో, కూతురి సాయంతో విలన్లను ఎలా మట్టుబెట్టింది అనేది క్లైమాక్స్.

ఎందుకు చూడాలి?

'స్క్రీమ్' సిరీస్ అభిమానులకు పాత పాత్రల జ్ఞాపకాలు రావడంతో పాటు, నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ వల్ల వచ్చే ప్రమాదాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి స్క్రీమ్ 7 మూవీ ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More