OTT: మట్కా కింగ్ గా విజయ్ వర్మ రచ్చ.. ముంబై మాఫియా సామ్రాజ్యంపై వెబ్ సిరీస్.. అదిరిన టీజర్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలోకి మరో అదిరే వెబ్ సిరీస్ రాబోతుంది. విజయ్ వర్మ హీరోగా నటించిన ‘మట్కా కింగ్’ సిరీస్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇవాళ టీజర్ ను వదిలారు.

Published on: Mar 29, 2026, 13:02:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. ముంబై మాఫియా, జూదం నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు 'మట్కా కింగ్'. 1960ల కాలంలో ముంబై నగరంలో ఒక సామాన్య పత్తి వ్యాపారి, తన తెలివితేటలతో దేశవ్యాప్తంగా విస్తరించిన జూదం (మట్కా) సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.

మట్కా కింగ్ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ (x/PrimeVideoIN)
మట్కా కింగ్ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ (x/PrimeVideoIN)

మట్కా కింగ్ ఓటీటీ

ఇవాళ (మార్చి 29) మట్కా కింగ్ వెబ్ సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 17, 2026న ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది.

విజయ్ వర్మ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

'మీర్జాపూర్', 'దహాద్' వంటి సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ ‘మట్కా కింగ్’ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ముంబై వీధుల్లో రాజ్యమేలిన 'మట్కా కింగ్' పాత్రలో ఆయన నటన ఎంతో సహజంగా, గంభీరంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ఇప్పటికే హింట్స్ ఇచ్చింది. టీజర్ తో మరోసారి దీనిపై క్లారిటీ వచ్చింది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా

మట్కా కింగ్ సిరీస్ ముంబైకి చెందిన అసలైన మట్కా కింగ్ రతన్ ఖత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. 1960 నుంచి 1990 వరకు ముంబై అండర్ వరల్డ్, పోలీస్ వ్యవస్థను ప్రభావితం చేసిన మట్కా ఆటకు సంబంధించిన చీకటి కోణాలను ఇందులో చూపించబోతున్నారు.

ప్రముఖ దర్శకుడు నాగ్ రాజ్ మంజులే ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. హానీ ట్రెహాన్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, విజువల్స్ పరంగా 1960ల నాటి ముంబైని అద్భుతంగా రీ-క్రియేట్ చేయబోతోంది.

ఎమోషనల్ గానూ

విజయ్ వర్మతో పాటు ఈ సిరీస్‌లో సాయి తమంకర్, గుల్షన్ దేవయ్య, సిద్ధార్థ్ జాదవ్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముంబై మాఫియా పాలిటిక్స్ తో పాటు పర్సనల్ ఎమోషన్స్ కలయికగా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్ట్రీమింగ్ వివరాలు

మట్కా కింగ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 17 నుంచి ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది.

వరుణ్ తేజ్ మూవీ

వరుణ్ తేజ్ 'మట్కా' సినిమా కూడా ఇదే నేపథ్యంతో వచ్చింది. దీంతో మట్కా కింగ్ సిరీస్ కు, మట్కాను కంపేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మట్కా కింగ్ అనేది వెబ్ సిరీస్ కావడంతో ఇందులో కథను మరింత లోతుగా, రాగా చూపించే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More