ప్రైమ్ వీడియో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సమంత భర్త

అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫర్జీ సీజన్ 2 వచ్చేస్తోంది. సమంత భర్త, డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. రాజ్ అండ్ డీకే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ అప్డేట్ రావడం విశేషం.

Published on: Feb 10, 2026, 15:27:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకులు రాజ్ & డీకే అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సీజన్ 2 పనులు మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సీక్వెల్ షూటింగ్, కథా విశేషాలు ఇక్కడ చూడండి.

ప్రైమ్ వీడియో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సమంత భర్త
ప్రైమ్ వీడియో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సమంత భర్త

"రెండో రౌండ్ మొదలైంది.."

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' (Farzi). 2023లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ అత్యధిక మంది చూసిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) సిరీస్ వార్షికోత్సవం సందర్భంగా దర్శకులు రాజ్ & డీకే ఫ్యాన్స్‌కు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.

తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో రాజ్ & డీకే ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. నకిలీ నోట్ల కట్టలతో ఉన్న ఆ ఫోటోపై "రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్" అని రాసి ఉంది. "సెకండ్ బ్యాచ్.. పని జరుగుతోంది (డబ్ల్యూఐపీ)" అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో 'ఫర్జీ సీజన్ 2' అధికారికంగా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమైందని క్లారిటీ వచ్చేసింది.

మార్చిలో షూటింగ్ షురూ

హీరో షాహిద్ కపూర్ కూడా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో "సన్నీ డేస్ బ్యాక్ సూన్.." అంటూ ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ హింట్ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం, 'ఫర్జీ 2' షూటింగ్ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. షాహిద్ కపూర్ ఈ సీక్వెల్ కోసం ఓటీటీ చరిత్రలోనే రికార్డు స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

రెండో సీజన్ కథేంటంటే..

మొదటి సీజన్ దొంగ నోట్ల ముద్రణ, ఫిజికల్ కరెన్సీ చుట్టూ తిరిగింది. అయితే రెండో సీజన్ మాత్రం డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీ మోసాలు, డిజిటల్ నకిలీలు, టెక్నాలజీతో కూడిన ఆర్థిక నేరాల చుట్టూ కథ నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొదటి సీజన్‌లో అలరించిన విజయ్ సేతుపతి (మైఖేల్), రాశి ఖన్నా, భువన్ అరోరా (ఫిరోజ్), కే కే మీనన్ రెండో సీజన్‌లోనూ కొనసాగుతారు. సన్నీ (షాహిద్) - మైఖేల్ (విజయ్ సేతుపతి) మధ్య పోరు ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి కాబట్టి ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది చివర్లో లేదా 2027 ఆరంభంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More