OTT Telugu: ఓటీటీలోకి ఈవారం రాబోతున్న టాప్ 4 తెలుగు సినిమాలు ఇవే.. రెండు బ్లాక్‌బస్టర్స్.. ఒకటి క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలోకి ఈవారం ఏకంగా మూడు సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి. తెలుగులో చాలా మూవీసే వస్తుండగా.. వాటిలో టాప్ 4 ఏవో ఇక్కడ చూడండి. రెండు బ్లాక్‌బస్టర్ సంక్రాంతి మూవీస్, మరొకటి నేరుగా ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి.
తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే పండగ. ఫిబ్రవరి 7 నుంచి 13 మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, యువ సంచలనం నవీన్ పోలిశెట్టి నటించిన భారీ సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో అలరించిన ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్, ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ చూడండి.

ఈవారం ఓటీటీలోకి రానున్న తెలుగు మూవీస్
ఈ వారం అంటే ఫిబ్రవరి 7 నుంచి 13 మధ్య తెలుగు ఓటీటీ స్పేస్ కళకళలాడనుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సినిమాలు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌లతో వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు మిస్ కాకూడని ఆ చిత్రాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మన శంకర వర ప్రసాద్ గారు - జీ5 ఓటీటీ
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. నెల రోజుల్లోపే అంటే బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా సుమారు రూ.400 కోట్ల వరకూ వసూలు చేసిన విషయం తెలిసిందే.
అనగనగా ఒక రాజు - నెట్‌ఫ్లిక్స్
'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్నా విడుదలయ్యాక రూ. 100 కోట్లు రాబట్టి సత్తా చాటింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో నవ్వులు పంచనుంది. ఈ మూవీ కూడా బుధవారమే (ఫిబ్రవరి 11) డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
సాంప్రదాయిన సుప్పిని సుద్దపూసని - ఈటీవీ విన్
శివాజీ, లయ జంటగా నటిస్తున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇందులో శివాజీ ఓ పంచాయతీ సెక్రటరీగా నటించాడు. ఈ మూవీ గురువారం అంటే ఫిబ్రవరి 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి - జీ5 ఓటీటీ
సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ మరో డిజాస్టర్ సినిమా ఇది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ క్లీన్ కామెడీ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 13) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతి డిజాస్టర్లలో ఇదీ ఒకటి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


