జీతూ జోసెఫ్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. మీనా నటించిన 'రోస్లిన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ పీడకలల వెనుక రహస్యమేంటి?

ఓటీటీలోకి మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రోస్లిన్ రాబోతోంది. ఇందులోపాటు సీనియర్ మీనాతోపాటు ప్రేమదేశం హీరో వినీత్ లీడ్ రోల్స్ లో నటించడం విశేషం. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ బయటకు వచ్చేసింది.

Published on: Feb 9, 2026, 14:16:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం థ్రిల్లర్ కంటెంట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆ ఇండస్ట్రీ నుంచి ఓ అదిరిసోయే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. గతంలోనే ఈ సిరీస్ గురించి జియోహాట్‌స్టార్ ఓటీటీలో అనౌన్స్ చేసింది. అయితే తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. అయితే దీనిపై హాట్‌స్టార్ నుంచి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఓటీటీలోకి మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మీనాతోపాటు ప్రేమదేశం హీరో నటించిన సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మీనాతోపాటు ప్రేమదేశం హీరో నటించిన సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

రోస్లిన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్

సీనియర్ నటి మీనా, ఎప్పుడో 30 ఏళ్ల కిందట ప్రేమదేశం మూవీతో తెలుగు వారికి కూడా దగ్గరైన నటుడు వినీత్ నటించిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్. కొన్ని రోజుల కిందటే ఈ సిరీస్ జియోహాట్‌స్టార్ లోకి రానుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. వినాయక్ శశికుమార్ కథను అందించగా, సుమేష్ నందకుమార్ దీనికి దర్శకత్వం వహించాడు.

రోస్లిన్ వెబ్ సిరీస్ కథేంటంటే?

‘రోస్లిన్’ అనే టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ అమ్మాయికి పదే పదే పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఆకుపచ్చ కళ్ళు ఉన్న ఒక ఆగంతకుడు ఆమెను వెంబడిస్తుంటాడు. ఆ అమ్మాయి భయాలు, ఆందోళనలు, వాటి ప్రభావం ఆమె కుటుంబంపై, చుట్టూ ఉన్నవారిపై ఎలా పడిందన్నదే ఈ వెబ్ సిరీస్ కథాంశం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

రోస్లిన్ వెబ్ సిరీస్ విశేషాలు

రోస్లిన్ వెబ్ సిరీస్ లో సంజన దిపు, హకీమ్ షా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సీనియర్ నటి మీనా, వినీత్ కూడా ఇందులో భాగం కావడం విశేషం. అన్నింటికంటే ముఖ్యంగా 'దృశ్యం' సిరీస్ తో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు.

మీనా ఇప్పటికే జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 'దృశ్యం' సిరీస్‌లో మోహన్‌లాల్ భార్యగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్ వెబ్ సిరీస్ కోసం రిపీట్ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో రాబోయే 'దృశ్యం 3' కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇతర వెబ్ సిరీస్‌లు

జియోహాట్‌స్టార్‌లో మలయాళ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల నివిన్ పాలీ నటించిన 'ఫార్మా' అనే వెబ్ సిరీస్ గతేడాది డిసెంబర్ లో విడుదలైంది. పి.ఆర్. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో నివిన్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కనిపించాడు.

అలాగే 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 1, 2 అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు మూడో సీజన్‌కు కూడా పచ్చజెండా ఊపారు. వీటితో పాటు 'అనలి', 'కజిన్స్ & కళ్యాణమ్స్' అనే మరో రెండు సిరీస్‌లు కూడా జియోహాట్‌స్టార్‌లో రానున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More