Dhurandhar 2 Collection: 1622 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2- ఇండియాలో 1023 కోట్లు- వారాల వారీగా వసూల్లు ఇలా!

Dhurandhar 2 Worldwide Collection: ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 19వ రోజున కూడా నిలకడగా వసూళ్లు రాబడుతూ, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1600 కోట్ల మైలురాయిని అధిగమించి రికార్డుల వేటను కొనసాగిస్తోంది.

Published on: Apr 7, 2026, 10:20:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తోంది. భారతదేశంలో ధురంధర్ 2 రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అలాగే, ఈ సినిమా మూడో వారాంతం తర్వాత కూడా గట్టి పోటీనిస్తోంది.

1622 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2- ఇండియాలో 1023 కోట్లు- వారాల వారీగా వసూల్లు ఇలా!
1622 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ 2- ఇండియాలో 1023 కోట్లు- వారాల వారీగా వసూల్లు ఇలా!

వసూళ్ల వివరాలు

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సక్నిల్క్' (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, ‘ధురంధర్ 2’ మూడో సోమవారం (19వ రోజు) దేశీయంగా రూ. 10.00 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారత్‌లో 19 రోజుల్లో ధురంధర్ 2 చిత్రం నెట్ కలెక్షన్స్ రూ. 1,023.77 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, రూ. 1213.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.

ధురంధర్ 2 వారాల వారీగా ఇండియన్ నెట్ కలెక్షన్స్:

మొదటి వారం: రూ. 674.17 కోట్లు (నెట్)

రెండో వారం: రూ. 263.65 కోట్లు (నెట్)

మూడో వారం (శుక్ర-ఆది): రూ. 75.95 కోట్లు (వరుసగా రూ. 21.55 కోట్లు, రూ. 25.65 కోట్లు, రూ. 28.75 కోట్లు)

సోమవారం (ఏప్రిల్ 6) నాడు కలెక్షన్స్‌లో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ ధురంధర్ 2 సినిమా తన పట్టును కోల్పోలేదు. కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1600 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. అలాగే, 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 చిత్రం సుమారుగా రూ. 1622.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

తెర వెనుక హీరోలకు సారా అర్జున్ ధన్యవాదాలు

కాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ సారా అర్జున్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్‌లతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. "నేను మొదటిసారి ఆదిత్య సార్‌ను కలిసినప్పుడే ఆయన కళ్లలో ఏదో తెలియని మెరుపు కనిపించింది. ఆయన సినిమా కోసం ఏదో అద్భుతం చేస్తారని అప్పుడే నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఆ నమ్మకం నిజమవుతూనే వచ్చింది" అని సారా అర్జున్ పేర్కొన్నారు.

ముఖ్యంగా తెర వెనుక కష్టపడే సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావిస్తూ.. "మేము పోస్టర్లపై కనిపించే ముఖాలం మాత్రమే, కానీ మీరు ఈ సినిమాకు వెన్నెముక వంటి వారు. వెలుగులో ఉన్న తారలకు ఎంత చప్పట్లు కొడతారో, తెర వెనుక చెమట చిందించిన అజ్ఞాత వీరులకు కూడా అంతే గౌరవం దక్కాలి" అని సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సినిమా నేపథ్యం

జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ ది రివేంజ్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ గూఢచారి జస్కీరాత్ సింగ్ రంగీ పాత్రలో నటించగా.. ఆర్. మాధవన్ ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్‌గా కనిపించారు. పాకిస్థాన్‌లో జరిగే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నేపథ్యంలో సాగే ఈ కథలో కాందహార్ హైజాక్, 26/11 ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనలను స్పృశించారు.

గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌లో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కొన్ని వర్గాల నుంచి 'ప్రొపగాండా' అనే విమర్శలు వచ్చినప్పటికీ, సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More