Adivi Sesh: ధురంధర్ 2 ఐపీఎల్ లాంటిది, 3-4 నెలలు ఉంటుంది.. హీరో అడివి శేష్ కామెంట్స్.. టికెట్స్ దొరక్కపోతే అంటూ!
Adivi Sesh About Dacoit Postpone For Dhurandhar 2: డెకాయిట్ సినిమా విడుదల తేదీని మార్చడంపై మీడియా అడిగిన ప్రశ్నకు హీరో అడివి శేష్ స్పందించారు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో డెకాయిట్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లుగా అడివి శేష్ చెప్పాడు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. తాజాగా ఏప్రిల్ 4న డెకాయిట్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా కథ చెప్పకుండా ఇంటెన్స్ సీన్స్‌తో డెకాయిట్ ట్రైలర్ అదిరిపోయింది. అయితే, మార్చి 19న ఉగాది కానుకగా డెకాయిట్ సినిమా విడుదల కావాల్సింది.

కానీ, అదే సమయంలో బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా రిలీజ్ కావడంతో డెకాయిట్ మూవీ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు మేకర్స్. దీంతో వచ్చే వారం 'డెకాయిట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10న డెకాయిట్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ వాయిదాపై అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'ధురంధర్ 2' ఒక ప్రభంజనం!
డెకాయిట్ విడుదల తేదీ మార్పు గురించి అడివి శేష్ మాట్లాడుతూ.. "మేము తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకుని మార్చి 19న రావాలనుకున్నాం. కానీ, నా మిత్రుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఒక ప్రభంజనం సృష్టించింది. ధురంధర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా హవా వల్ల మా చిత్రానికి సరైన థియేటర్లు దొరకడం కష్టమనిపించింది. అందుకే వెనక్కి తగ్గాం" అని నిజాయితీగా అంగీకరించారు.
ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంపై స్పందిస్తూ.. "ఈ సినిమా (ధురంధర్ 2) మరో మూడు నాలుగు నెలల పాటు థియేటర్లలో ఆడుతుందని నా నమ్మకం. ఇది ఐపీఎల్ లాంటిది.. ఒక సంస్కృతినే ప్రభావితం చేసే గొప్ప విషయం. అయితే, థియేటర్లలో అన్ని రకాల సినిమాలకు చోటు ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ధురంధర్ 2 టికెట్లు దొరకకపోతే, హ్యాపీగా మా 'డెకాయిట్' చూడొచ్చు" అంటూ చమత్కరించారు అడివి శేష్.
యాక్షన్ లవ్ డ్రామాగా ‘డెకాయిట్’
షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు కొన్ని అనివార్య కారణాల వల్ల కలిసి దొంగతనాలు చేయాల్సి రావడం, ఆ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చింది అనేదే ఈ చిత్ర కథ. ఇందులో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అజేయంగా ‘ధురంధర్ 2’
మరోవైపు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూడో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని పట్టు సాధించింది. పాకిస్థాన్‌లోని ల్యారీ గ్యాంగ్‌లను అంతం చేసే భారతీయ గూఢచారి హమ్జా (జస్కీరాత్ సింగ్ రంగీ) కథతో తెరకెక్కిన ఈ చిత్రం, అటు యాక్షన్ ప్రియులను, ఇటు సాధారణ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటన ధురంధర్ 2కి ప్లస్ పాయింట్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


