Dhurandhar 2 BO: 22.6 శాతానికి పడిపోయిన ధురంధర్ 2 కలెక్షన్స్- అయినా 1400 కోట్లకు దగ్గరిలో- నిన్న ఒక్కరోజే 25 కోట్లు!

Dhurandhar 2 Box Office Collection Day 12: రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన 12వ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,392 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. కానీ, ఈ సినిమాకు వర్కింగ్ డేలో మాత్రం 22.6 శాతం వసూళ్లు పడిపోయాయి.

Published on: Mar 31, 2026, 07:01:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా చేసిన వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ రెండో వారంలోనూ తన జోరు చూపిస్తోంది. వీకెండ్ ముగిసి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో వసూళ్లలో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ, ఓవరాల్‌గా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మాత్రం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

22.6 శాతానికి పడిపోయిన ధురంధర్ 2 కలెక్షన్స్- అయినా 1400 కోట్లకు దగ్గరిలో- నిన్న ఒక్కరోజే 25 కోట్లు!
22.6 శాతానికి పడిపోయిన ధురంధర్ 2 కలెక్షన్స్- అయినా 1400 కోట్లకు దగ్గరిలో- నిన్న ఒక్కరోజే 25 కోట్లు!

12వ రోజు వసూళ్ల రిపోర్ట్

ధురంధర్ 2 సినిమా విడుదలైన 12వ రోజు (రెండో సోమవారం మార్చి 30) అంటే నిన్న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 25.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో దేశీయంగా ఈ చిత్రం మొత్తంగా రూ. 872.17 కోట్ల నెట్ (రూ. 1,042.23 కోట్ల గ్రాస్) మార్కును చేరుకుంది.

కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తన సత్తా చాటుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటివరకు ధురంధర్ 2 రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2’ వసూళ్లు రూ. 1,392.23 కోట్లకు చేరుకున్నాయి. అంటే, దాదాపుగా రూ. 1400 కోట్ల కలెక్షన్స్‌ మార్క్‌కు దగ్గరిలో ఉంది ఈ సినిమా.

వసూళ్లలో తగ్గుదల.. ట్రేడ్ అనలిస్టులు ఏమంటున్నారు?

రెండో ఆదివారం (మార్చి 29) రూ. 68.10 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ధురంధర్ 2 సోమవారం నాటికి 62.8 శాతం తగ్గుదలని నమోదు చేసింది. "పెద్ద సినిమాలకు వీకెండ్ తర్వాత సోమవారం వసూళ్లు తగ్గడం చాలా సహజమైన ప్రక్రియ. ఆదివారం 48.5 శాతంగా ఉన్న థియేటర్ ఆక్యుపెన్సీ, సోమవారం 22.6 శాతానికి పడిపోయింది.

అయితే దేశవ్యాప్తంగా ఇంకా 17,592 షోలతో ధురంధర్ 2 సినిమా నడుస్తుండటం విశేషం. ఇది ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఉన్న ఆసక్తిని, ఎగ్జిబిటర్ల నమ్మకాన్ని తెలియజేస్తోంది" అని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రణ్‌వీర్ సింగ్ మ్యాజిక్

ఇదిలా ఉంటే, ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ పోషించిన గూఢచారి పాత్రకు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. అతిగా కాకుండా, ఎంతో హుందాగా ఆయన చేసిన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అందుకే చాలా మంది ఈ సినిమాను రెండోసారి, మూడోసారి కూడా చూస్తున్నారు. విదేశీ మార్కెట్లలో నిలకడగా వసూళ్లు రావడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం, ‘ధురంధర్ 2’ తన విజయయాత్రను ఇలాగే కొనసాగిస్తే మరిన్ని రికార్డులు కనుమరుగవ్వడం ఖాయం. రెండో వారం వర్కింగ్ డేస్‌లో నిలకడగా ఉండి, వచ్చే వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటే ధురంధర్ 2 సినిమా రూ. 1,500 కోట్ల మైలురాయిని సులువుగా దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More