Dhurandhar 2 Collections: ధురంధర్ 2 ర్యాంపేజ్.. 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్.. రెండో వారంలోనూ తగ్గని రణ్‌వీర్ క్రేజ్
Dhurandhar 2 Collections: ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. తొమ్మిది రోజుల్లోనే రూ.1128 కోట్లు వసూలు చేసి షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డును చెరిపివేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా పూర్తి బాక్సాఫీస్ రిపోర్ట్ పై ఓ లుక్కేయండి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. రెండో వారంలోనూ ఈ సినిమా కలెక్షన్ల మోతో మోగిస్తోంది. ధురంధర్ 2 తొమ్మిది రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ను ఇక్కడ చూసేయండి.

ధురంధర్ 2 కలెక్షన్లు
రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా తొమ్మిదో రోజైన శుక్రవారం (మార్చి 27) కూడా కలెక్షన్లలో అదరగొట్టింది. దేశవ్యాప్తంగా 18,456 షోల ద్వారా ఏకంగా రూ.41.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
రికార్డు స్థాయిలో
ఈ తాజా వసూళ్లతో కలిపి తొమ్మిది రోజుల్లో భారతదేశంలో ధురంధర్ 2 మొత్తం నెట్ కలెక్షన్ రూ.715.72 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే, ఈ సినిమా ఇప్పటికే రూ.854.99 కోట్లను దాటేసింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం భారతీయ సినిమా చరిత్రలో అరుదైన ఘనతగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా
విదేశీ మార్కెట్లలో కూడా రణ్‌వీర్ సింగ్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.274 కోట్లు వసూలు చేసింది. దీనితో ధురంధర్ 2 తొమ్మిది రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ రూ.1,128.99 కోట్లకు చేరింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ.1,100 కోట్లు) రికార్డును కూడా ధురంధర్ 2 మూవీ బ్రేక్ చేసింది.
పెరిగిన థియేటర్ ఆక్యుపెన్సీ
ఎనిమిదో రోజుతో పోలిస్తే తొమ్మిదో రోజు వసూళ్లలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, థియేటర్ ఆక్యుపెన్సీ మాత్రం 28.4% నుండి 31.4%కి పెరిగింది. ఇది వీకెండ్ లో సినిమా మరింత పుంజుకుంటుందనే దానికి సంకేతంగా నిలుస్తోంది. మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ప్రేక్షకులు ధురంధర్ 2కు బ్రహ్మరథం పడుతున్నారు.
ఓవర్సీస్ మార్కెట్లో పట్టు
అంతర్జాతీయంగా ముఖ్యంగా ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ధురంధర్ 2 అదరగొడుతోంది. భారతీయ చిత్రాల పరిధి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరిస్తోందో ఈ సినిమా నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ధురంధర్ 2 గురించి
జియో స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ 2 చిత్రం 2025 నాటి బ్లాక్‌బస్టర్ 'ధురంధర్'కు సీక్వెల్. 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో కరాచీ క్రిమినల్ నెట్‌వర్క్‌లోకి చొరబడే ఒక భారతీయ గూఢచారి కథ ఇది. వాస్తవ సంఘటనలను కలిపి ఈ కథను ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు.
ఈ చిత్రంలో ఆపరేషన్ లయారీ, 2014 సార్వత్రిక ఎన్నికలు, 2016 నోట్ల రద్దు వంటి వాస్తవ సంఘటనలను స్పృశించారు. రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ వంటి అగ్ర నటులు తమ నటనతో మెప్పించారు. సుదీర్ఘమైన రన్ టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఈ సినిమా విజయం సాధించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


