Ranveer Singh: ప్రభాస్, షారుక్ ఖాన్ రికార్డు సమం చేసిన రణ్‌వీర్ సింగ్.. ఇండియాలో ఈ ఘనత సాధించిన మూడో హీరో

Ranveer Singh: ప్రభాస్, షారుక్ ఖాన్ సరసన చేరాడు రణ్‌వీర్ సింగ్. రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ మూవీస్ ఉన్న నటుడిగా అతడు ఈ రికార్డు అందుకున్నాడు. తాజాగా ధురంధర్ 2 మూవీతో రణ్‌వీర్ ఈ ఘనత సాధించాడు.

Published on: Mar 27, 2026, 15:51:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ 'ధురంధర్ ద రివెంజ్' బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉంది. రూ.1000 కోట్ల ఎలైట్ క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రేజీ అచీవ్‌మెంట్‌తో 40 ఏళ్ల రణ్‌వీర్ సింగ్.. తమ కెరీర్‌లో ఒకటి కంటే ఎక్కువ రూ.1000 కోట్ల సినిమాలు ఉన్న టాప్ ఇండియన్ యాక్టర్స్ లిస్ట్‌లో గర్వంగా చేరిపోయాడు.

Ranveer Singh: ప్రభాస్, షారుక్ ఖాన్ రికార్డు సమం చేసిన రణ్‌వీర్ సింగ్.. ఇండియాలో ఈ ఘనత సాధించిన మూడో హీరో
Ranveer Singh: ప్రభాస్, షారుక్ ఖాన్ రికార్డు సమం చేసిన రణ్‌వీర్ సింగ్.. ఇండియాలో ఈ ఘనత సాధించిన మూడో హీరో

ప్రభాస్, షారుక్ తర్వాత..

షారుక్ ఖాన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి దిగ్గజాలు ఉన్న ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అతి తక్కువ టైమ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణ్‌వీర్ 'హమ్జా అలీ మజారీ' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. మేజర్ ఇక్బాల్‌ను పట్టుకునే క్రమంలో పాకిస్థాన్ క్రైమ్ సిస్టమ్‌ను నాశనం చేయడానికి అతను చేసే పోరాటమే ఈ సినిమా అసలు కథ.

పాత రికార్డులు ఒకసారి చూసుకుంటే.. 2023లో వచ్చిన షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' వరల్డ్‌వైడ్‌గా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటడానికి 27 రోజులు పట్టింది. అదే ఏడాది వచ్చిన షారుక్ మరో బ్లాక్ బస్టర్ 'జవాన్' ఈ మార్క్‌ను 154 రోజుల్లో చేరుకుంది. ఇక ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' అయితే కేవలం 12 రోజుల్లోనే రూ.1000 కోట్ల బెంచ్‌మార్క్‌ను టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే లేటెస్ట్‌గా వచ్చిన ప్రభాస్ టాలీవుడ్ మూవీ 'కల్కి 2898 ఏడీ' కూడా రిలీజైన 16 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి దుమ్ములేపింది.

ఎనిమిదో రోజు 'ధురంధర్ 2' కలెక్షన్స్ ఇవే..

ఫస్ట్ వీక్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన తర్వాత కూడా రణ్‌వీర్ సింగ్ సినిమా తన హిస్టారిక్ రన్‌ను కంటిన్యూ చేస్తోంది. రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, మార్చి 26న అంటే గురువారం నాడు ఇండియాలో కలెక్షన్ల పరంగా కొంచెం గ్రోత్ చూపించింది.

ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ రిపోర్ట్స్ ప్రకారం, ఎనిమిదో రోజు ఇండియాలో ఈ సినిమా రూ.49.70 కోట్లు (నెట్) వసూలు చేసింది. అంతకుముందు బుధవారం నాడు అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా 48.25 కోట్ల నెట్ బిజినెస్ చేసింది. దీంతో ఇండియాలో ఈ ఎనిమిది రోజుల టోటల్ నెట్ కలెక్షన్లు ఏకంగా రూ.674.17 కోట్లకు చేరుకున్నాయి. గ్రాస్ చూస్తే ఇది రూ.800 కోట్ల మార్క్ దాటేసింది.

'ధురంధర్ 2' వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గకుండా రూ.261.92 కోట్లు రాబట్టి సత్తా చాటింది. ఇండియాలో రూ.805.32 కోట్ల గ్రాస్‌తో కలుపుకుని, మొత్తం ఎనిమిది రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా టోటల్ కలెక్షన్లు రూ.1,067.24 కోట్ల గ్రాస్‌కు చేరుకున్నాయి.

ఫస్ట్ వీక్‌లో 'ధురంధర్ 2' బద్దలుకొట్టిన రికార్డులు ఇవే

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ పెయిడ్ ప్రీమియర్స్.

ఇండియాలో హిందీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్.

సింగిల్ లాంగ్వేజ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో రోజు.

సింగిల్ లాంగ్వేజ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో రోజు.

సింగిల్ లాంగ్వేజ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో రోజు.

వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక బాలీవుడ్ సినిమాకు దక్కిన బిగ్గెస్ట్ ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్.

వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక బాలీవుడ్ సినిమాకు దక్కిన బిగ్గెస్ట్ ఫ్రైడే టు సండే ఓపెనింగ్ వీకెండ్ (రూ.515 కోట్లకు పైగా గ్రాస్).

డొమెస్టిక్ బాక్సాఫీస్ (ఇండియా) దగ్గర ఒక బాలీవుడ్ సినిమాకు దక్కిన బిగ్గెస్ట్ ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్.

నటుడుసినిమాప్రపంచవ్యాప్త కలెక్షన్లుడొమెస్టిక్ కలెక్షన్లుఓవర్సీస్ కలెక్షన్లుఏడాది
1ఆమిర్ ఖాన్దంగల్ 2,024 crore 512 crore 1,512 crore2016
2ప్రభాస్బాహుబలి 2: ది కంక్లూజన్ 1,810.60 crore 1,430 crore 380.60 crore2017
3అల్లు అర్జున్పుష్ప 2 : ది రూల్ 1,642 crore 1,381 crore 261 crore2024
4రణ్‌వీర్ సింగ్ధురంధర్ 1,349 crore 1,056 crore 293.03 crore2025
5రామ్ చరణ్ఆర్ఆర్ఆర్ 1,300 crore 944 crore 443 crore2022
6యశ్కేజీఎఫ్: ఛాప్టర్ 2 1,250 crore 1,008 crore 242 crore2022
7షారుక్ ఖాన్జవాన్ 1,148.32 crore 761.98 crore 386.34 crore2023
8ప్రభాస్కల్కి 2898 ఏడీ 1,100 crore 776 crore 324 crore2024
9రణ్‌వీర్ సింగ్ధురంధర్: ది రివెంజ్ 1,067.24 crore 805.32 crore 261.92 crore2026
10షారుక్ ఖాన్ పఠాన్ 1,050.50 crore 654.28 crore 396.22 crore2023
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More