Aditya Dhar: రణ్‌వీర్ సింగ్ సిగరెట్ ఫొటోల వెనుక అసలు నిజం! డైరెక్టర్ ఆదిత్య ధర్ సీరియస్ వార్నింగ్.. అల్లర్ల కోసం కుట్ర
Aditya Dhar: 'ధురంధర్ 2' సినిమాలో రణ్‌వీర్ సింగ్ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫోటోల వెనుక ఉన్న అసలు నిజాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ వెల్లడించాడు. అవి ఏఐ (AI) సృష్టించిన మార్ఫింగ్ చిత్రాలని, వాటిని నమ్మవద్దన్నాడు.
బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. వారంలోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమాలో రణ్‌వీర్ సింగ్ తలపాగ (టర్బన్) ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై డైరెక్టర్ ఆదిథ్య ధర్ రియాక్టయ్యాడు.

ఆదిత్య ధర్ పోస్ట్
ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అతను యాక్టింగ్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ టర్బన్ ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. వీటిపై సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.
ఏఐ (AI) సృష్టించినవే
వైరల్ అవుతున్న ఆ చిత్రాలు పూర్తిగా అవాస్తవమని, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మార్ఫింగ్ చేసినవని ఆదిత్య ధర్ స్పష్టం చేశాడు. అఫీషియల్ స్టిల్స్ ను కొందరు తప్పుడు ఉద్దేశంతో మార్చారని ఆదిత్య పేర్కొన్నాడు.
అల్లర్ల కోసం
ఇలా ఏఐ వాడి ఫొటోలు మార్ఫ్ చేసి సమాజంలో అల్లర్లు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆదిత్య ధర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి తప్పుడు కథనాలు, ఫొటోలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించాడు.
సిక్కు సమాజంపై గౌరవం
తాను సిక్కు సమాజం పట్ల అత్యంత గౌరవం కలిగి ఉన్నానని, చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో బాధ్యతతో చిత్రీకరించామని దర్శకుడు ఆదిత్య తెలిపాడు.
"మా చిత్రంలో ఎక్కడా తలపాగ ధరించిన పాత్ర సిగరెట్ తాగలేదు. ఇది కేవలం మమ్మల్ని రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం" అని ఆదిత్య పేర్కొన్నాడు. కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన ప్రేక్షకులను కోరాడు.
మాధవన్ కూడా
కేవలం రణ్‌వీర్ పాత్రే కాకుండా, ఆర్.మాధవన్ క్యారెక్టర్ కూడా ధురంధర్ 2 సినిమాలోని ఓ సన్నివేశంలో ధూమపానం చేస్తూ పద్యాలు పఠిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మాధవన్ స్వయంగా స్పందిస్తూ, ఆ సన్నివేశం చిత్రీకరణలో దర్శకుడు ఎంతో జాగ్రత్త వహించారని తెలిపాడు. ఆ సంభాషణలు చెప్పే ముందే తన పాత్ర సిగరెట్ తాగడం ఆపివేసిందని, ఎక్కడా మతపరమైన మనోభావాలు దెబ్బతినలేదని ఆయన వివరించాడు.
రికార్డుల వేట
ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ, 'ధురంధర్ 2' వసూళ్లలో ఏమాత్రం తగ్గడం లేదు. సక్నిల్క్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్లు ఖాతాలో వేసుకుంది. కరాచీ అండర్ వరల్డ్‌లో హమ్జా అలీ మజారీగా రణ్‌వీర్ సింగ్ నటించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


