Dhurandhar 2 OTT: ఓటీటీలోకి ధురంధర్ 2- రికార్డ్ ధరకు డిజిటల్ రైట్స్- మొదటి పార్ట్ కంటే ఎక్కువగా- నెట్‌ఫ్లిక్స్‌లో కాదు!
Dhurandhar 2 OTT Streaming Details: ఓటీటీలోకి ధురంధర్ 2 స్ట్రీమింగ్ కానుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ధురంధర్ ది రివేంజ్ ఓటీటీ రైట్స్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కావట్లేదు. మరి ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గూఢచారి విన్యాసం 'ధరంధర్ 2: ది రివెంజ్' థియేటర్లలో చరిత్ర సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాను వెండితెరపై చూసిన ప్రేక్షకులు, ఇప్పుడు డిజిటల్ వేదికపై ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొదటి భాగం ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కాగా.. సీక్వెల్ మాత్రం రూటు మార్చింది. అంటే, నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరంటే?
బాలీవుడ్ హంగామా, పింక్‌విల్లా కథనాల ప్రకారం, ధురంధర్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) కైవసం చేసుకుంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, సుమారు ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత అంటే.. మే నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
మైండ్ బ్లోయింగ్ డీల్.. రూ. 150 కోట్లు!
ఓటీటీ మార్కెట్‌లో ప్రస్తుతం ధురంధర్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ధర హాట్ టాపిక్ అయింది. జియో హాట్‌స్టార్ ఓటీటీ ధురంధర్ 2 డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ. 150 కోట్లు చెల్లించినట్లు సమాచారం. మొదటి భాగమైన ధురంధర్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 85 కోట్లకు కొనుగోలు చేయగా, రెండో భాగం అంతకు రెట్టింపు ధర పలకడం విశేషం.
"మొదటి భాగం విడుదలకు ముందే రెండు సినిమాలను కలిపి రూ. 175 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ అడిగింది. కానీ, తమ కంటెంట్‌పై నమ్మకంతో జియో స్టూడియోస్ వేచి చూసింది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో, ఇప్పుడు కేవలం రెండో భాగానికే రూ. 150 కోట్లు రాబట్టగలిగింది. ఇటీవలి కాలంలో ఓటీటీ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది ఒకటి" అని సినీ వర్గాలు వెల్లడించాయి.
సినీ ప్రముఖుల ప్రశంసలు
ఇకపోతే ధురంధర్ 2 సినిమాను ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అనుపమ్ ఖేర్, కరణ్ జోహార్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, బాలీవుడ్‌లోని కొందరు సెలబ్రిటీలు ఈ సినిమా సక్సెస్‌పై మౌనంగా ఉండటంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
వర్మ సంచలన వ్యాఖ్యలు!
"దర్శకుడు ఆదిత్య ధర్ ఇండస్ట్రీ కింద ఒక అణుబాంబు పేల్చారు. కానీ, మిగిలిన పరిశ్రమ మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఆ బాంబు ధాటికి వారంతా అంతరిక్షంలోకి విసిరివేయబడి ఉంటారు.. అందుకే వారి చప్పట్లు మనకు వినిపించడం లేదు" అని రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.
పక్షవాతం అంటూ సెటైర్లు
"లేదా ఇది కేవలం ప్రచార చిత్రం అని భ్రమలో బతుకుతూ మళ్లీ పాత రోత సినిమాలే తీయాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఈ సినిమా అద్భుత ప్రతిభను చూసి నోటమాట రాక పక్షవాతం వచ్చినట్టు ఉండిపోయారా?" అంటూ ఆర్జీవీ తన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేశారు.
ధురంధర్ 2 నటీనటులు
కాగా, ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరి పాత్ర, వారి నటన ధురంధర్ 2 సక్సెస్‌కు కారణమని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


