Sign in

Arjun Rampal: 26/11 దాడి నాడే నా బర్త్ డే, రక్తపాతం కళ్లారా చూశాను- ఇలా ప్రతికారం తీర్చుకున్నా: ధురంధర్ విలన్ అర్జున్

Arjun Rampal On 26/11 Attack Revenge: ముంబై ఉగ్రదాడుల భయంకరమైన స్మృతులను ధురంధర్ విలన్ అర్జున్ రాంపాల్ గుర్తు చేసుకున్నారు. తన పుట్టినరోజు నాడే జరిగిన ఆ దాడులకు తాను ఎలా ప్రతికారం తీర్చుకున్నారో చెబుతూ ఎమోషనల్ అయ్యారు అర్జున్ రాంపాల్. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 23, 2026, 13:49:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ‘ధురంధర్’ చిత్రం 2008 ముంబై దాడుల నాటి భీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను వణికించింది. ఈ సినిమాలో పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI) మేజర్ ఇక్బాల్‌గా విలన్ రోల్‌లో ఆకట్టుకున్నారు అర్జున్ రాంపాల్. తాజాగా ఒక అవార్డు వేడుకలో 26/11 దాడులకు సంబంధించి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు అర్జున్.

26/11 దాడి నాడే నా బర్త్ డే, రక్తపాతం కళ్లారా చూశాను- ఇలా ప్రతికారం తీర్చుకున్నా: ధురంధర్ విలన్ అర్జున్
26/11 దాడి నాడే నా బర్త్ డే, రక్తపాతం కళ్లారా చూశాను- ఇలా ప్రతికారం తీర్చుకున్నా: ధురంధర్ విలన్ అర్జున్

సరిగ్గా నా పుట్టినరోజు నాడే..

"2008లో ముంబై దాడులు జరిగిన రాత్రి నా పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులను పికప్ చేసుకోవడానికి హోటల్‌కు వెళ్లాను. మేమంతా తాజ్ హోటల్‌కు బయలుదేరుతుండగా మాహిమ్ వద్ద మొదటి పేలుడు శబ్దం వినిపించింది. ఆ ధాటికి కారు అద్దాలు గజగజ వణికిపోయాయి. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు" అని అర్జున్ రాంపాల్ తెలిపారు.

ప్రాణభయంతో ఆ రాత్రి అక్కడే

"కొద్దిసేపటికే ఫోన్లు రావడం మొదలైంది. కొలాబాలో గ్యాంగ్ వార్ జరుగుతోందని అందరూ అనుకున్నారు. కానీ, అరగంటలోనే ఫోర్ సీజన్స్ హోటల్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ప్రాణభయంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది" అని అర్జున్ రాంపాల్ నాటి భయంకర దృశ్యాలను వివరించారు.

మూడుసార్లు వాంతులు

మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్లపై కనిపించిన రక్తపాతం చూసి తట్టుకోలేకపోయానని, కారు ఆపి మూడుసార్లు వాంతులు చేసుకున్నానని అర్జున్ రాంపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతీకారం తీర్చుకోవడానికి

అందుకే దర్శకుడు ఆదిత్య ధర్ తనకు ఈ కథ చెప్పినప్పుడు, ఆ ఉగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదొక మార్గమని భావించినట్లు అర్జున్ రాంపాల్ తెలిపారు. "ధురంధర్ సినిమా ద్వారా నా ప్రతీకారం తీర్చుకున్నాను. భారత్ మాతా కీ జై" అంటూ అర్జున్ రాంపాల్ తన ప్రసంగాన్ని ముగించారు.

మేజర్ ఇక్బాల్ పాత్రలో అర్జున్..

ఇక 'ధురంధర్' మొదటి భాగంలో అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుంది. ముంబైలో ఉగ్రవాదులు నరమేధం సాగిస్తుంటే, అక్కడ పాకిస్థాన్‌లో పార్టీ చేసుకుంటూ వారిని నడిపించే హ్యాండ్లర్‌గా ఆయన నటించారు. అయితే, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’లో రణ్‌వీర్ సింగ్ (హమ్జా) చేతిలో ఈ ఇక్బాల్ పాత్ర అత్యంత భయంకరంగా హతమవుతుంది.

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' ప్రభంజనం

మొదటి భాగం ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్ 2’ ఆ రికార్డులను తిరగరాస్తోంది. మొదటి రోజే రూ. 145 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ధురంధర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే దేశీయంగా రూ. 450 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More