RGV: గాడ్ ఫాదర్‌‌కే గాడ్ ఫాదర్ ధురంధర్ 2, నా పాత సినిమాలన్నీ బూడిదే- సిండికేట్ ఎలా ఉండనుందో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma On Dhurandhar 2 And Syndicate Theme: ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్ 2' ప్రభంజనంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తన ఫిల్మ్ మేకింగ్ బెంచ్‌మార్క్‌లనే మార్చేసిందని, తన తదుపరి చిత్రం 'సిండికేట్' ఈ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని ఆర్జీవీ ప్రకటించారు.

Mar 26, 2026, 12:57:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీపై వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధురంధర్ ది రివేంజ్ భారతీయ సినిమాకు కొత్త బాటలు చూపిందని, ఒకరకంగా ఇది తనను తాను రీ-బూట్ చేసుకునేలా చేసిందని ఆర్జీవీ పేర్కొన్నారు.

గాడ్ ఫాదర్‌‌కే గాడ్ ఫాదర్ ధురంధర్ 2, నా పాత సినిమాలన్నీ బూడిదే- సిండికేట్ ఎలా ఉండనుందో చెప్పిన రామ్ గోపాల్ వర్మ
గాడ్ ఫాదర్‌‌కే గాడ్ ఫాదర్ ధురంధర్ 2, నా పాత సినిమాలన్నీ బూడిదే- సిండికేట్ ఎలా ఉండనుందో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

"నా పాత పాఠాలు పనికిరావు.. కొత్త స్కూల్లో చేరాల్సిందే"

తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. "ధురంధర్ 2 చూసిన తర్వాత నా పాత సినిమాలన్నీ ఏమీ కావనిపించింది. ఇప్పటి వరకు నా సినిమాలకు 'ది గాడ్‌ఫాదర్' ఒక బెంచ్‌మార్క్. కానీ ఈ సినిమా చూశాక అది 'గాడ్‌ఫాదర్‌కే గాడ్‌ఫాదర్' అని అర్థమైంది" అని అన్నారు.

"మేకింగ్, కథ చెప్పే విధానం, క్యారెక్టర్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ప్రతి విషయంలో ఆదిత్య ధర్ అద్భుతాలు చేశారు. అందుకే పాత స్కూల్ పాఠాలను వదిలేసి, ఆదిత్య ధర్ కొత్త స్కూల్లో చేరాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే మనం అప్‌డేటెడ్‌గా ఉండగలం" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

సంచలనంగా మారనున్న ‘సిండికేట్’

తన కొత్త ప్రాజెక్ట్ 'సిండికేట్' గురించి ప్రస్తావిస్తూ.. "ఒక్క రోజులో దేశంలోని శాంతి భద్రతలు మొత్తం కుప్పకూలిపోతే పరిస్థితి ఏంటి? అనే పాయింట్ మీద ఈ సినిమా (సిండికేట్) ఉంటుంది. ఇందులో దెయ్యాలు ఉండవు కానీ, మనుషుల మెదడులోని భయంకరమైన ఆలోచనలే హారర్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి" అని ఆర్జీవీ పేర్కొన్నారు.

శక్తివంతమైన వ్యవస్థ పుట్టుక గురించి

"దేశ ఉనికికే సవాలు విసిరే ఒక శక్తివంతమైన వ్యవస్థ పుట్టుక గురించి ఇందులో చూపిస్తున్నాను. ధురంధర్ 2 తర్వాత రాబోయే కాలానికి తగినట్టుగా నా 'సిండికేట్' ఉంటుంది" అని రామ్ గోపాల్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.

మేకర్స్‌కు హెచ్చరిక!

సినిమా రంగంలో ఉన్న దర్శకులు, నటులు, రచయితలు తమ ఈగోలను పక్కన పెట్టి ‘ధురంధర్ 2’ మీద ఒక అకడమిక్ రీసెర్చ్ చేయాలని వర్మ సూచించారు. "మార్చి 19, 2026న పాత సినిమా సూత్రాలన్నీ చనిపోయాయి. ఇంకా ఆ పాత పద్ధతులనే పట్టుకుని వేలాడితే.. మీ కెరీర్ కూడా కనుమరుగవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిందే" అని ఆర్జీవీ హెచ్చరించారు.

ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల చుట్టూ

కరాచీలోని ల్యారీ ప్రాంతం నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల చుట్టూ తిరిగే ‘ధురంధర్ 2’ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. రణ్‌వీర్‌తోపాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ల నటనకు వర్మ ఫిదా అయిపోయారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More