OTT Horror: ఓటీటీలోకి వచ్చిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్- వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే రాకాసి- తెలుగులో స్ట్రీమింగ్!

OTT Horror Adventure Thriller Telugu: ఓటీటీలోకి హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ మాన్‌స్టర్ సమ్మర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ నటుడు మెల్ గిబ్సన్ నటించిన ఈ మూవీలో వేసవిలో స్కూల్ పిల్లలను ఓ రాకాసి వెంటాడుతుంటుంది. ఈ మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Mar 24, 2026, 14:09:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో స్కూల్ పిల్లలు చూసేలా ఉండే అడ్వెంచర్ హారర్ మూవీస్‌పై పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ వరకు ఇంటిల్లిపాది చూడాలనుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు.

ఓటీటీలోకి వచ్చిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్- వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే రాకాసి- తెలుగులో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి వచ్చిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్- వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే రాకాసి- తెలుగులో స్ట్రీమింగ్!

టీనేజ్ హారర అడ్వెంచర్ థ్రిల్లర్

అలాంటి టైమ్‌లో అదే కథతో వచ్చిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమానే మాన్‌స్టర్ సమ్మర్. ఇది ఒక టీనేజ్ హారర అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. అంటే, ఇందులో స్కూల్ పిల్లల చుట్టూ సాగే హారర్ అడ్వెంచర్ మిస్టరీ కథ ఇది. వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే ఓ రాకాసి, దాంతో ఆ పిల్లల పోరాటం వంటి కథతో మాన్‌స్టర్ సమ్మర్ మూవీ సాగుతుంది.

మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ

ఇలాంటి మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీలోకి తెలుగులో కూడా వచ్చేసింది. హాలీవుడ్ సీనియర్ నటుడు మెల్ గిబ్సన్, ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ ఫేమ్ మాసన్ థేమ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే మాన్‌స్టర్ సమ్మర్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది.

ఇండియన్ ఓటీటీ వేదికపై

ఆ తర్వాత సుమారు తొమ్మిది నెలలకు పారామౌంట్ ప్లస్ విత్ షో టైమ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాన్‌స్టర్ సమ్మర్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కానీ, ఈ ప్లాట్‌ఫామ్‌లో భారతీయులు కాకుండా అమెరికాలో మాత్రమే చూడగలరు. కానీ, ఇప్పుడు ఇండియన్ ఓటీటీ వేదికపైకి కూడా మాన్‌స్టర్ సమ్మర్ సినిమా వచ్చేసింది.

4 భాషల్లో స్ట్రీమింగ్

జియో హాట్‌స్టార్‌లో మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, ఇండియన్స్ కూడా హాట్‌స్టార్ ఓటీటీలో మాన్‌స్టర్ సమ్మర్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు. మార్చి 20న మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్ భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అసలు కథేంటంటే?

ఒక ప్రశాంతమైన ఐలాండ్‌లో స్కూల్ స్నేహితులంతా కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఊహించని విధంగా ఒక రహస్యమైన అతీంద్రియ శక్తి వారి ఆనందాన్ని ఆవిరి చేస్తుంది. ద్వీపంలోని వారందరినీ ప్రమాదంలోకి నెడుతుంది.

మూవీ ట్విస్టులు

ఈ క్రమంలో రిటైర్డ్ పోలీస్ డిటెక్టివ్ (మెల్ గిబ్సన్) సాయంతో ఆ స్కూల్ పిల్లల బృందం ఆ వింత శక్తుల వెనుక ఉన్న నిజాన్ని ఎలా కనిపెట్టారు? ఆ రాకాసితో ఎలా పోరాటం చేశారు? అసలు ఆ రాకాసి వల్ల వచ్చిన ప్రమాదం ఏంటీ? దాని బారిన పడిన పిల్లలకు ఏమైంది? స్కూల్ పిల్లల వెంటే ఆ మాన్‌స్టర్ ఎందుకు పడింది? తమ ద్వీపాన్ని పిల్లలు ఎలా కాపాడుకున్నారు? అన్నదే ఈ సినిమా ఇతివృత్తం.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

మాన్‌స్టర్ సమ్మర్ సినిమాలో మెల్ గిబ్సన్‌తో పాటు జూలియన్ లెర్నర్, అబ్బీ జేమ్స్ విదర్‌స్పూన్ వంటి తారలు నటించారు. మరి ఈ స్కూల్ పిల్లలు, రాకాసి, పోరాటం వంటి కాన్సెప్ట్‌తో వచ్చిన గంట 37 నిమిషాలు గల మాన్‌స్టర్ సమ్మర్ సినిమాను జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More