OTT Survival: ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్- యూట్యూబ్ ప్రేమ జంటను వెంటాడే మొసలి- 8.4 రేటింగ్- ఎక్కడంటే?
OTT Romantic Survival Horror Thriller: ఓటీటీలోకి రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ తు యా మై స్ట్రీమింగ్‌కు వచ్చేయనుంది. స్విమ్మింగ్ పూల్‌లో యూట్యూబ్ ప్రేమ జంటను వెంటాడే మొసలి కథతో ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీకి 8.4 రేటింగ్ ఉంది. మరి ఈ తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లలో విడుదల కాగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు చెప్పుకునే సినిమా మాత్రం ఏకంగా 8 వారాలకు ఓటీటీ రిలీజ్ కానుంది. ఆ సినిమానే తు యా మై. తెలుగులో నువ్వా నేనా అనే అర్థం వస్తుంది.

సర్వైవల్ హారర్ థ్రిల్లర్
తు యా మై ఒక రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ యూట్యూబ్ ప్రేమ జంటగా నటించారు. తు యా మై సినిమాకు వెరైటీ సినిమాలను అందించే డైరెక్టర్ బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు.
తు యా మై సినిమా 2018లో వచ్చిన థాయ్ మూవీ ది పూల్ ఆధారంగా తెరకెక్కింది. తు యా మై వాలంటైన్స్ డే కానుకగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, షనయ, ఆదర్శ్ గౌరవ్ నటనకు మాత్రం ప్రశంసలు కురిశాయి.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ముఖ్యంగా భయంతో వణికే సన్నివేశాల్లో స్టార్ కిడ్ షనయ కపూర్ ఇమిడిపోయి నటించిందని కామెంట్స్ వినిపించాయి. ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న తు యా మై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి ఏకంగా 8.4 రేటింగ్ సంపాదించుకుంది తు యా మై సినిమా.
తు యా మై కథలోకి వెళితే.. అవని షా (షనయ కపూర్) మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా (ఆదర్శ్ గౌరవ్) నలసోపారాకు చెందిన అప్‌కమింగ్ రాపర్. వీరిద్దరు యూట్యూబ్‌లో డిఫరెంట్ వీడియోలు చేస్తూ పాపులర్ అవ్వాలనుకుంటారు.
వెంటాడే ప్రాణాంతక మొసలి
భిన్నమైన లోకాల్లో బతికే వీరిద్దరు ఓ కొలాబరేషన్ వీడియో ద్వారా కలుసుకుంటారు. ఈ యూట్యూబ్ జంట మధ్య ప్రేమ చిగురిస్తుంది. అవని షా లగ్జరీ లైఫ్ మారుతిని అట్రాక్ట్ చేస్తే.. అతడిలో ఉండే నిజాయితీని అవని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో గోవా వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఒక పాడుబడిన హోటల్‌లో ఈ జంట చిక్కుకుపోతుంది.
ఆ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకున్న ఈ జంట మొసలి బారిన పడుతుంది. ఈ యూట్యూబ్ జంటను ఆ స్విమ్మింగ్ పూల్‌లో ప్రాణాంతకమైన మొసలి చంపేందుకు వెంటాడుతుంది. ఆ మొసలి నుంచి ఆ ప్రేమ జంట ప్రాణాలతో బయటపడిందా? లేదా మొసలికే బలి అయ్యారా? అనేదే ఈ సినిమా కథ.
తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్
ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన తు యా మై ఓటీటీలోకి వచ్చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తు యా మై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో తు యా మై ఓటీటీ రిలీజ్ అవనుంది.
ఇప్పుడున్న సమాచారం వరకు కేవలం హిందీ భాషలో మాత్రమే తు యా మై ఓటీటీ ప్రీమియర్ కానుందని సమాచారం. రొమాంటిక్, హారర్, లవ్, అడ్వెంచర్, సర్వైవల్ అంశాలున్న తు యా మై మూవీని మిస్ అయిన వాళ్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇంకో 20 రోజుల్లో ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


