Mahesh Babu: ఓటీటీ సిరీస్‌లో నటనకు ప్రశంసలు- మహేశ్ బాబుతో యాడ్ షూటింగ్- సూపర్ స్టార్ గురించి నీరు సెహగల్ ఏం చెప్పిందంటే?

Netflix OTT Actress Neeru Sehgal About Mahesh Babu: నెట్‌‌ఫ్లిక్స్ ఓటీటీ పాపులర్ సిరీస్ 'కోహ్రా' సీజన్ 2లో లవ్లీన్ పాత్రతో నీరు సెహగల్ అందరి దృష్టిని ఆకర్షించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్‌లో నటనకు ప్రశంసలు అందుకుంటున్న నీరు సెహగల్ సూపర్ స్టార్ మహేశ్ బాబుపై కామెంట్స్ చేశారు.

Published on: Mar 22, 2026, 07:39:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గతేడాది సృష్టించిన సంచలనం 'కోహ్రా'. ఇప్పుడు ఈ ఓటీటీ సిరీస్ కోహ్రా సీజన్ 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో లవ్లీన్ అనే కీలక పాత్రలో నటించిన మోడల్ కమ్ యాక్ట్రెస్ నీరు సెహగల్ తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్నారు.

ఓటీటీ సిరీస్‌లో నటనకు ప్రశంసలు- మహేశ్ బాబుతో యాడ్ షూటింగ్- సూపర్ స్టార్ గురించి నీరు సెహగల్ ఏం చెప్పిందంటే?
ఓటీటీ సిరీస్‌లో నటనకు ప్రశంసలు- మహేశ్ బాబుతో యాడ్ షూటింగ్- సూపర్ స్టార్ గురించి నీరు సెహగల్ ఏం చెప్పిందంటే?

అమెరికాలో పెరిగినా వీడని పంజాబీ బంధం

2026 సంవత్సరం తనకి ఎంతో ప్రత్యేకం అని, ఒక నటిగా తను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని నీరు సెహగల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరు సెహగల్ పెరిగింది అమెరికాలోనైనా, తన పంజాబీ మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదని చెబుతారు. ఆమె కుటుంబం పంజాబీ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందట.

నటనలోకి రాకముందు నీరు సెహగల్ ఒక బ్యూటీ పేజెంట్ క్వీన్. అందాల పోటీలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని, అయితే కథలు చెప్పడం అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె అంటారు. అందుకే మోడలింగ్ నుంచి నటన వైపు సహజంగానే అడుగులు వేశానని నీరూ వివరించారు.

'కోహ్రా 2'లోకి లవ్లీన్ ప్రవేశం

కోహ్రా ఓటీటీ సిరీస్‌లో సామ్ (రణ్‌విజయ్ సింఘా) ప్రేయసిగా, ఒక హత్య కేసులో చిక్కుకున్న వ్యక్తికి అండగా నిలిచే లవ్లీన్ పాత్రలో నీరు సెహగల్ కనిపించారు. ఈ పాత్ర కోసం ఆమె స్వయంగా కాస్టింగ్ డైరెక్టర్‌ను సంప్రదించి ఆడిషన్ ఇచ్చారట. పంజాబీలో తన ఇంట్రో వీడియో పంపిన తర్వాత, సెల్ఫ్ టేప్ ద్వారా ఈ అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు వస్తున్న స్పందన చూసి నీరు సెహగల్ మురిసిపోతున్నారు.

మహేశ్ బాబుతో షూటింగ్ అనుభవం

అయితే, నీరు సెహగల్ గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఒక ప్రకటన (యాడ్)లో నటించారు. ఆ అనుభవం గురించి అడిగినప్పుడు నీరు సెహగల్ కళ్లు మెరిశాయి.

"మహేశ్ బాబు అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఎంతో వినయంగా ఉంటారు. సెట్‌లో ఆయన చూపించే క్రమశిక్షణ, పని పట్ల ఆయనకున్న ఏకాగ్రత చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనతో పనిచేయడం నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది" అని నీరు సెహగల్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కథలు దొరికితే సౌత్ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమని నీరు సెహగల్ స్పష్టం చేశారు.

లోతైన కథలతో 'కోహ్రా'

ఇకపోతే సుదీప్ శర్మ దర్శకత్వంలో వచ్చిన 'కోహ్రా' కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. పంజాబ్‌లోని కుల వివక్ష, లింగ వివక్ష వంటి సామాజిక అంశాలను కూడా ఇది చర్చిస్తుంది. గందరగోళ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడే లవ్లీన్ వంటి పాత్రను పోషించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నీరు సెహగల్ ముగించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కోహ్రా సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More