OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 11 సినిమాలు- చూసేందుకు అన్నీ చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 4!
OTT Release Telugu Movies: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో 6 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈటీవీ విన్ నుంచి ఆహా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో చూద్దాం.
ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో సైకలాజికల్, రొమాంటిక్, కామెడీ, యాక్షన్, క్రైమ్, హారర్ ఫాంటసీ, హారర్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. ఈటీవీ విన్ నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, ఆహా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఈటీవీ విన్ ఓటీటీ
సుమతీ శతకం (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 19
సీతా రాములు (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 22
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది హౌజ్‌మెయిడ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 19
స్టీల్ బాల్ రన్ (తెలుగు డబ్బింగ్ యాక్షన్ అడ్వెంచర్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మార్చి 19
బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎల్‌జీబీట్యూక్యూ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 19
పీకీ బ్లైండర్స్ ది ఇమ్మోర్టల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
విష్ణు విన్యాసం (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 20
జీ5 ఓటీటీ
జటాధర (తెలుగు హారర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
సీతా పయనం (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ రోడ్ జర్నీ మూవీ)- మార్చి 19
జియో హాట్‌స్టార్ ఓటీటీ
చిరాయా (తెలుగు డబ్బింగ్ హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
ఆహా ఓటీటీ
అమరావతికి ఆహ్వానం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
ఓటీటీలోకి తెలుగులో 11 సినిమాలు
ఇలా గత వారం (మార్చి 16 నుంచి 22 వరకు) తెలుగులో ఏకంగా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 6
అయితే, వాటిలో కూడా సుమతీ శతకం, సీతా రాములు, విష్ణు విన్యాసం, జటాధర, అమరావతికి ఆహ్వానం, సీతా పయనం వంటి ఆరు తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే
ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 4 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


