అమరావతికి ఆహ్వానం రివ్యూ- నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ రివేంజ్ హారర్ థ్రిల్లర్ మెప్పించిందా?

టాలీవుడ్ పాపులర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ నొరోన్హా కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు రివేంజ్ హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఇవాళ థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ మెప్పించిందా? లేదా? అనేది నేటి అమరావతికి ఆహ్వానం రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Feb 13, 2026, 18:57:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్ : అమరావతికి ఆహ్వానం

అమరావతికి ఆహ్వానం రివ్యూ- నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ రివేంజ్ హారర్ థ్రిల్లర్ మెప్పించిందా?
అమరావతికి ఆహ్వానం రివ్యూ- నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ రివేంజ్ హారర్ థ్రిల్లర్ మెప్పించిందా?

నటీనటులు: శివ కంఠమనేని, ఎస్తేర్‌ నొరోన్హా, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జీవీకే

సంగీతం: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌

సినిమాటోగ్రఫీ: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి

ఎడిటింగ్‌: సాయిబాబు తలారి

నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాణ సార‌థ్యం: ముప్పా వెంక‌య్య చౌద‌రి

స‌మ‌ర్ప‌ణ‌: జి. రాంబాబు యాద‌వ్‌

బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: వై. అనిల్ కుమార్‌, కె. శ్రీ‌నివాస్‌రావు

విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు సురేఖ వాణి. ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సురేఖ వాణి కుమార్తె సుప్రితతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఎస్తర్ నొరోన్హా, ధన్య బాలకృష్ణ నటించిన రివేంజ్ హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం.

శివ కంఠమనేని మెయిన్ లీడ్ చేసిన అమరావతికి ఆహ్వానం సినిమాకు జీవీకే దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అమరావతికి ఆహ్వానం సినిమా ఇవాళ (ఫిబ్రవరి 13) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా భయపెట్టిందా?, మెప్పించిందా?, ఎలా ఉంది? అనే వివరాలను నేటి అమరావతికి ఆహ్వానం రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఈశ్వర్‌ (శివ కంఠమనేని) ఒక సస్పెండ్ అయిన సీఐ. ఈశ్వర్ భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతికి భార్గవి (సుప్రిత), విజ్జు ఇద్దరు సిస్టర్స్. భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలని ఆకాంక్ష. ఇందుకోసం ఓ యూట్యూబ్‌ చానెల్‌ను రన్‌ చేస్తుంటుంది.

ఈ యూట్యూబ్‌ చానెల్‌లో దెయ్యంతో డే అండ్‌ నైట్‌ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు షూట్‌ చేసి, అప్‌లోడ్‌ చేస్తుంటుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్‌ అయ్యి, భార్గవి రాత్రికి రాత్రే పెద్ద సెల‌బ్రిటీ అయిపోతుంది.

అయితే సడెన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విష‌యాన్ని లైవ్‌లో నిరూపిస్తానని, ఈ వీడియో షూట్‌ చేస్తే ఇంకా ఫేమస్‌ కావొచ్చని భార్గవికి ఆ అజ్ఞాతవ్యక్తి చెప్తాడు. దీంతో ఎగ్జైట్ అయిన భార్గవి త‌న అమరావతి అనే గ్రామానికి, కుటుంబంతో సహా వెళ్తుంది.

ట్విస్టులు

అమరావతిలో ఈశ్వర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్‌ నొరోన్హా)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్‌ కుటుంబానికి మధ్య ఉన్న లింక్‌ ఏమిటి? సీఐగా ఈశ్వర్‌ సస్సెండ్‌ కావడానికి కారణం ఏంటీ? ఎవరు? అన్న ఆసక్తికరమైన, థ్రిల్లింగ్‌ విషయాలను సినిమాలోనే చూడాలి.

విశ్లేషణ:

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. మెజారిటీ హారర్‌ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్ర పూజలు వంటి అంశాలనే ప్రధాన కథాంశంగా ఉంటాయి. ఈ ‘అమరావతికి ఆహ్వానం’ సినిమాలో ఈ అంశాలు ఉంటూనే, ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు మంచి సందేశాన్ని దర్శకుడు మేళవించిన తీరు ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.

టైటిల్‌లో అమరావతి ఉంది కనుక, ఇది ఒక పొలిటికల్‌ మూవీ కాదని మేకర్స్‌ ముందునుంచి చెబుతూనే వచ్చారు. మేకర్స్ చెప్పినట్లుగానే ఈ చిత్రంలో ఏ మాత్రం రాజకీయపరమైన అంశాలు లేవు. ఇది ఒక ప‌క్కా హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమా.

ఇంటర్‌వెల్ ట్విస్ట్

అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. భార్గవి వీడియో షూట్‌ చేయడం, మహేశ్ (శివ హ‌రీశ్‌)తో ప్రేమ, ఈశ్వర్‌ అండ్‌ ఫ్యామిలీ అమరావతికి వెళ్లి, అక్కడ రాజేశ్వరిని గురించిన నిజం తెలుసుకోవడంతో తొలి భాగం ముగుస్తుంది.

ప్రీ ఇంటర్‌వెల్ ట్విస్ట్ బాగా ఆకట్టుకుంటుంది. రాజేశ్వరి క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌‌మెంట్, ఆమె ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో కథనం ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది. సినిమాలో వచ్చి హారర్‌ ఎలిమెంట్స్‌ బాగానే మెప్పిస్తాయి.

కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహించినట్లుగానే సీన్స్ సాగుతాయి. సాధారణంగా ఇలాంటి హారర్‌ థ్రిల్లర్స్‌లో వచ్చే సాంగ్స్‌ కథకు స్పీడ్‌ బ్రేకర్స్‌లా అనిపిస్తాయి. కానీ, సెంకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో వచ్చిన డుం డుం డియ్యాల సాంగ్ ఆడియెన్స్‌కు కాస్తా హాయినిస్తుంది. ఇక‌ క్లైమాక్స్‌ కథకు తగ్గట్లుగా డిజైన్ చేసుకున్నారు ద‌ర్శ‌కుడు జీవీకే.

నటీనటులు

ఈశ్వర్‌, జ‌గ‌దీష్‌ పాత్రల‌లో శివ కంఠమనేని నటన బాగుంది. యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. జగదీష్‌గా విలన్‌ మార్క్‌ యాక్టింగ్‌ చూపించారు. డ్యూయెల్ రోల్‌లో ఆయ‌న పెర్ఫామెన్స్ బాగుంది. ఈ సినిమాకు మరో మెయిన్‌ పిల్లర్‌ ఎస్తేర్ నొరోన్హా. రాజేశ్వరి పాత్రలో ఆమె యాక్టింగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది. ప్లాష్‌బ్యాక్‌సీన్స్‌లో మంచి సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు.

ఇక భానుమతి పాత్రలో ధన్య బాలకృష్ణ నటన మెప్పించేలా ఉంది. హారర్‌ సీన్స్‌‌లోనూ ధన్య బాలకృష్ణ ఆకట్టుకుంది. అలాగే, భార్గవి పాత్రను సుప్రిత చాలా ఈజ్‌తో చేసింది. మొద‌టి సినిమాతోనే అన్ని ర‌కాల ఎమోష‌న్స్ పండించే అవ‌కాశం ద‌క్కింది. మహేశ్‌ పాత్రలో హరీష్ న‌ట‌న బాగుంది.

డాక్టర్‌ అమ్మి రాజు పాత్రకి జెమినీ సురేష్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. లాయర్‌ కామేష్‌గా భద్రమ్ త‌న దైన మార్క్ కామెడీ చూపించారు. జమీందారు రాజుగా అశోక్‌ కుమార్, కాలగా నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం

హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్‌ అంశాలను కథలో కరెక్ట్‌గా మిళితం చేయడంలో దర్శకుడు జీవీకే దాదాపుగా సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. డీవోపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి గారికి కెమెరా వర్క్‌ బాగుంది. పద్మనాభ్‌ భరద్వాజ్‌ సంగీతం, బీజీఎమ్ ఆకట్టుకుంటాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఒక వైపు త‌న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హార‌ర్ మూడ్ క్యారీ చేస్తూనే పాట‌తో రీఫ్రెష్‌మెంట్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో ఆర్ఆర్ అదిరిపోయింది. లైట్ హౌస్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే హారర్‌, థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్ అమరావతికి ఆహ్వానంపై ఓ లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More