OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- అద్దంలో బతికే రాకాసి దెయ్యం- తెలుగులోనూ స్ట్రీమింగ్?

OTT Horror Thriller Release Today: ఓటీటీలోకి ఇవాళ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 4 వేల కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ది కంజూరింగ్ ఫైనల్ రైట్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతోపాటు 4 భాషల్లో ది కంజూరింగ్ ఫైనల్ రైట్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అది ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 13, 2026, 13:37:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్‌లోని ‘ది కంజురింగ్’ యూనివర్స్ అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన భయం, ఆసక్తి కలగలిసి ఉంటాయి.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- అద్దంలో బతికే రాకాసి దెయ్యం- తెలుగులోనూ స్ట్రీమింగ్?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- అద్దంలో బతికే రాకాసి దెయ్యం- తెలుగులోనూ స్ట్రీమింగ్?

ఇవాళ ఓటీటీలోకి

వరల్డ్ వైడ్‌గా అంతలా ప్రజాదరణ పొందిన హారర్ ఫ్రాంచైజీ ‘ది కంజురింగ్’ సిరీస్‌లో చివరిదైన ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 13) వచ్చేసింది. గతేడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

బడ్జెట్ అండ్ కలెక్షన్స్

కేవలం 55 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 460 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన లాస్ట్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 499 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. హారర్ సినిమాల చరిత్రలోనే అత్యంత భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్.

వెన్నులో వణుకు పుట్టేలా

అంతేకాకుండా ఇండియాలో కూడా లాస్ట్ రైట్స్ సినిమా సినిమా రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మిగతా సినిమాలతో పోలిస్తే మరింత హారర్ సీన్లతో, వెన్నులో వణుకు పుట్టించేలా ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ సినిమాను తెరకెక్కించారు.

ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ రిలీజ్

అలాంటి ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (ఫిబ్రవరి 13) జియో హాట్‌స్టార్‌లో ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంతో కలిపి మొత్తంగా నాలుగు భాషల్లో ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కథేంటంటే?

ఈ చివరి భాగంలో కూడా ఎడ్, లోరైన్ వారెన్ (పాట్రిక్ విల్సన్, వేరా ఫార్మిగా) పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లుగా కనిపిస్తారు. ఈసారి కథ 1986 నాటి పెన్సిల్వేనియాలోని ‘స్మర్ల్ ఫ్యామిలీ’ (Smurl family) చుట్టూ తిరుగుతుంది. వారి ఇంటిని పీడిస్తున్న ఒక భయంకరమైన రాకాసి దెయ్యం, ఒక పాత పురాతన అద్దానికి అనుసంధానమై ఉంటుంది.

అద్దంలో బతికే రాకాసి

ఆ అద్దంలో ఆ రాకాసి దెయ్యం బతుకుతుంటుంది. అదే అద్దాన్ని తాకిన తర్వాత లోరైన్ వారెన్‌కు చిత్ర విచిత్రమైన భయంకర దృశ్యాలు కనిపిస్తుంటాయి. తమ రిటైర్‌మెంట్‌ను పక్కన పెట్టి, ఈ భయంకర దెయ్యం నుంచి ఆ కుటుంబాన్ని వారెన్ దంపతులు ఎలా కాపాడారు? ఆ క్రమంలో తమ కూతురు జుడీకి ఎదురైన ప్రమాదమేంటి? అనే అంశాలను దర్శకుడు మైఖేల్ చావ్స్ వెన్నులో వణుకు పుట్టేలా తెరకెక్కించారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇకపోతే ది కంజూరింగ్ సిరీస్‌లో చివరి సినిమా లాస్ట్ రైట్స్ కావడంతో మూవీకి మరింత క్రేజ్ వచ్చింది. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు, థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీపై ఓ లుక్కేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More