Dhurandhar 2 Review By RGV: ధురంధర్ 2పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ- షోలే కంటే 100 రెట్లు గొప్పగా, వాళ్లు నేర్చుకోవాలంటూ!
Ram Gopal Varma Review On Dhurandhar 2: ధురంధర్ 2పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ ఇచ్చారు. తాజాగా ధురంధర్ ది రివేంజ్ ప్రివ్యూ చేసిన ఆర్జీవీ ఈ రెండో భాగాన్న ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా ‘షోలే’ కంటే 100 రెట్లు గొప్పగా ఉందని, ఆ సినిమాలు టీవీ సీరియల్స్‌లా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఒక సినిమా నచ్చితే దానిని ఆకాశానికి ఎత్తేయడం ఆయన శైలి. తాజాగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ప్రివ్యూ చూసిన రామ్ గోపాల్ వర్మ ధురంధర్ 2పై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ధురంధర్ 2పై రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా చేసిన నటించిన ఈ చిత్రం మొదటి భాగం ధురంధర్ సృష్టించిన ప్రభంజనాన్ని మించిపోనుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
షోలే కంటే 100 రెట్లు గొప్పగా..
ఆర్జీవీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "గతరాత్రి ‘ధురంధర్ 2’ చూశాను. బాక్సాఫీస్ వసూళ్లు, ప్రేక్షకుల ఉత్సాహం, సామాజిక ప్రభావం.. ఇలా ఏ కోణంలో చూసినా ఇది అద్భుతం. దీని ఆడియో విజువల్ ఇంపాక్ట్ ‘షోలే’ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ‘మొఘల్-ఎ-అజం’ వంటి గొప్ప చిత్రాలన్నీ ఈ సినిమా ముందు టీవీ సీరియల్స్‌లా కనిపిస్తాయి" అని ఆర్జీవీ రాసుకొచ్చారు.
పనులన్నీ పక్కనపెట్టి
దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరును ప్రశంసిస్తూ.. "సినిమా ప్రపంచంలో ఇదొక కొత్త అధ్యాయం. ఇకపై ‘డైరెక్టర్’ అనే పదానికి స్పెల్లింగ్ ఆదిత్య పేరుతోనే మొదలవుతుంది. స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు కూడా తమ పనులన్నీ పక్కనపెట్టి ‘ధురంధర్ 2’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం మంచిది" అని రామ్ గోపాల్ వర్మ చమత్కరించారు.
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
కాగా, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ధురంధర్ 2 చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ధురంధర్’ మొదటి భాగం రూ. 1300 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా, దీని సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ దానికి రెట్టింపు వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 18 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి.
50 కోట్లు వచ్చే అవకాశం
పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) ప్రతినిధి కమల్ జ్ఞాన్‌చందాని తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారానే బుధవారం రూ. 45 నుంచి రూ. 50 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 4 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
బుక్ మై షో అంచనాల ప్రకారం
సాధారణంగా దక్షిణాదిన ఉండే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోల సంస్కృతి ఈ సినిమాతో ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ కనిపిస్తోంది. బుక్ మై షో (BookMyShow) అంచనాల ప్రకారం.. హిందీ వెర్షన్ ఒక్కటే మొదటి రోజు రూ. 35 నుంచి రూ. 40 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా
ఇదిలా ఉంటే, ధురంధర్ 2 చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. అయితే, ఇదే మార్చి 19న విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ వాయిదా పడగా పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం రిలీజ్ అవనున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


