Pawan Kalyan: దళపతి విజయ్ జన నాయగన్ సెన్సార్ వివాదంపై పవన్ కల్యాణ్- కేంద్రంపై నిందలు సరికాదు, ఆ స్థాయిలోనే పొరపాటు అంటూ!
Pawan Kalyan On Vijay Jana Nayagan Censor Issue: దళపతి విజయ్ సినిమా ‘జన నాయగన్’ సెన్సార్ జాప్యం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలను జన సేనాని పవన్ కల్యాణ్ కొట్టిపారేశారు. నిబంధనలు అందరికీ ఒకటేనని, తన సినిమా ‘ఓజీ’కి కూడా సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమా విడుదలలో జరుగుతున్న జాప్యానికి కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వమే కారణమని చిత్ర యూనిట్ పరోక్షంగా ఆరోపణలు చేస్తోంది.

అయితే, ఈ ఆరోపణలను పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోసిపుచ్చారు. తాజాగా ‘తంతి టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఈ అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిబంధనలు ఎవరికైనా ఒకటే!
సెన్సార్ బోర్డు (CBFC) నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉంటుందన్న వాదనలో వాస్తవం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. "జన నాయగన్ విషయంలో సెన్సార్ బోర్డు స్థాయిలోనే ఏదో పొరపాటు జరిగింది. దానికి ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం సమంజసం కాదు" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు స్వతంత్రంగా పనిచేస్తుందని, కేవలం సాంకేతిక కారణాల వల్లే జాప్యం జరుగుతుండవచ్చని ఆయన వివరించారు.
నా ‘OG’ సినిమాకే ‘A’ ఇచ్చారు..
తన వాదనను సమర్థించుకోవడానికి పవన్ కల్యాణ్ చిత్రం ‘OG’ (ఓజీ) ఉదాహరణను ప్రస్తావించారు. "నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి, మన సినిమాకు సెన్సార్ వెసులుబాటు ఉంటుందని నా నిర్మాతలు, దర్శకులు భావించారు. కానీ, నేను వారిని మందలించాను" అని తెలిపారు.
"ఓజీ సినిమాలో హింస ఎక్కువగా ఉన్నప్పుడు ‘U/A’ ఎలా ఆశిస్తారు? నియమం అందరికీ ఒకటే. అందుకే నా సినిమాకు బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినా నేను స్వాగతించాను" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వం వేరు, సెన్సార్ బోర్డు వ్యవహారాలు వేరని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఫలితం ఎవరి చేతుల్లో ఉండదు
అంతేకాకుండా, ఈ వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని, న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఫలితం ఎవరి చేతుల్లో ఉండదని పవన్ కల్యాణ్ చిత్ర బృందానికి సూచించారు.
అసలేం జరిగింది?
నిజానికి ‘జన నాయగన్’ సినిమా ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 2025లో ఈ సినిమాను సెన్సార్ కమిటీకి చూపించగా, కొన్ని కట్స్ సూచిస్తూ ‘U/A’ ఇచ్చేందుకు అంగీకరించారు.
అయితే, సినిమాలో ఉన్న కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై ఫిర్యాదులు రావడంతో, దీనిని రివైజింగ్ కమిటీకి పంపారు. దీంతో సర్టిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమై సినిమా విడుదల నిలిచిపోయింది.
జన నాయగన్ నటీనటులు
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జన నాయగన్ సినిమాలో మమిత బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో
ఇక మరోవైపు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో భాగంగానే జన నాయగన్ సెన్సార్ వివాదంపై పవన్ కల్యాణ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రాశీ ఖన్నా, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్స్‌గా చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


