Leader Review: లీడర్ రివ్యూ- లెజెండ్ శరవణన్ స్పై యాక్షన్ థ్రిల్లర్- పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా, అమృత సినిమా ఎలా ఉందంటే?
Leader Movie 2026 Review In Telugu And Rating: ది లెజెండ్ తర్వాత హీరో శరవణన్ నటించిన తాజా చిత్రం లీడర్. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. భారీ హంగులు, యాక్షన్ ఎపిసోడ్లతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో నేటి లీడర్ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: లీడర్

నటీనటులు: శరవణన్, పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా, అమృత అయ్యర్, శ్యామ్, సంతోష్ ప్రతాప్, వీటీవీ గణేష్, లాల్, బాహుబలి ప్రభాకర్, ఐశ్వర్య తదితరులు
కథ, దర్శకత్వం: ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ఎస్ వెంకటేష్
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్
నిర్మాణ సంస్థ: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: లెజెండ్ శరవణన్
విడుదల తేది: 3 ఏప్రిల్ 2026
తొలి సినిమా 'ది లెజెండ్'తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన హీరో శరవణన్. తనదైన స్టైల్, భారీ బడ్జెట్ సినిమాలతో వెండితెరపై సత్తా చాటాలని ఆరాటపడే లెజెండ్ శరవణన్ తాజాగా నటించిన సినిమా లీడర్. ఈ సినిమాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌తోపాటు ఆండ్రియా, అమృత అయ్యర్ హీరోయిన్స్‌గా చేశారు.
ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ సినిమాలతోపాటు లీడర్ 2026 మూవీ కూడా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల అయింది. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి లీడర్ రివ్యూలో చూద్దాం.
కథ:
శక్తివేల్ (శరవణన్) ఒక కారు మెకానిక్. వినికిడి లోపం ఉన్న కూతురు అయిరేని (ఇయల్)ని శక్తివేల్ ఎంతో ప్రాణంగా చూసుకుంటాడు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) పోర్టులో అక్రమాలు చేసే సాల్ట్ (బాహుబలి ప్రభాకర్)ను పట్టుకునేందుకు శక్తివేల్ సహాయం కోరుతుంది. కానీ, దానికి శక్తివేల్ నిరాకరిస్తాడు. దాంతో కూతురి కిడ్నాప్ డ్రామా ఆడి సాల్ట్‌పై శక్తివేల్ తిరగబడేలా చేస్తుంది.
ఆ తర్వాత ఏం జరిగింది? శక్తివేల్‌ను ఇంద్రా సత్యమూర్తి ఎలాంటి సహాయం కోరింది? తనపై ఎదురుతిరిగిన సాల్ట్ దగ్గర ఉన్న కూతురును శక్తివేల్ ఎలా కాపాడుకున్నాడు? అసలు శక్తివేల్ గతం ఏంటీ? అతనికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ డెవిల్ (సంతోష్ ప్రతాప్)కు ఉన్న విరోధం ఏంటీ? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీరా (పాయల్ రాజ్‌పుత్)ను శక్తివేల్ ఎందుకు చంపాడు? తెలియాలంటే ఈ లీడర్ చూడాల్సిందే.
విశ్లేషణ:
2026లో వచ్చిన ఈ లీడర్ మూవీ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. దీనికి తండ్రీ-కూతురు బంధాన్ని జోడించి ఎమోషనల్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచారు డైరెక్టర్. తూత్తుకుడి పోర్టు నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక మాజీ రా ఏజెంట్ అనుకోని సంఘటనల వల్ల రహస్యంగా బతకాల్సి వస్తుంది. ఈ క్రమంలో పోలీస్ కారణంగా కూతురు ప్రాణాలు ప్రమాదంలో పడటం, దాంతో అజ్ఞాతవాసాన్ని వీడి పోరాడటం వంటి అంశాలతో సాగుతుంది.
శక్తివేల్ గతం, టెర్రరిస్ట్‌తో ఉన్న విరోధం వంటి అంశాలు అన్ని రెగ్యులర్ స్టోరీ టెంప్లేట్‌లోనే ఉంటాయి. అయితే, కొన్నిచోట్ల ఆకట్టుకునే యాక్షన్ సీన్స్, తండ్రి కూతుళ్ల బంధానికి సంబంధించి వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. స్టోరీ రొటీన్‌గా ఉండటంతో కొత్తదనం కనిపించనట్లు అనిపిస్తుంది. కానీ, టేకింగ్‌లో దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఊహించే క్లైమాక్స్
ఇక ఇంటర్వెల్‌లో శక్తివేల్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ బాగానే ఉంటుంది. రా ఏజెంట్, తన టీమ్‌తో చేసే సాహసాలు, హీరోయిన్‌తో ప్రేమ, పెళ్లి, విలన్‌తో శత్రుత్వం వంటివి సెకండాఫ్‌లో అలరిస్తాయి. హీరోయిన్‌ను హీరో చంపే సీన్ నాటకీయంగా పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ అంతా ఊహించేలా ఉన్న బాగుంటుంది.
ఇక టెక్నికల్ విషయానికొస్తే విజువల్స్ చాలా రిచ్‌గా గ్రాండ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ బాగున్నాయి. జిబ్రాన్ సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ మూడ్‌కు తగినట్లుగా వస్తుంది. ఇక డైరెక్టర్ టేకింగ్ ఓకే అని చెప్పుకోవచ్చు. నటుడిగా శరవణన్ ఆకట్టుకున్నారు. రా ఏజెంట్ పాత్రలో సీరియస్ లుక్‌తో మెప్పించారు. వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి.
తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్‌తో మెప్పించే!
పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా తక్కువ నిడివి ఉంటుంది. ఉన్నంతలో అట్రాక్ట్ చేస్తుంది పాయల్. ఆండ్రియా, అమృత అయ్యర్ మిగతా పాత్రలన్ని పరిధి మేర ఆకట్టుకుంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ ఫార్ములాతో వచ్చిన తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్‌తో మెప్పించే లీడర్.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


