Dacoit Trailer: ఓ వైపు డెకాయిట్ ట్రైలర్ రిలీజ్.. మరోవైపు మృణాల్ ఠాకూర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో హీరోయిన్.. ఏం జరిగింది?
Dacoit Trailer: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు ఏమైంది? చేతులకు బేడీలతో పోలీస్ వ్యాన్ లో ఆమెను ఎందుకు తీసుకొచ్చారు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసిన తర్వాత కలుగుతున్న ప్రశ్నలు ఇవి. ఓ వైపు డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ కాగా.. మరోవైపు చేతులకు సంకెళ్లతో ఉన్న మృణాల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అరెస్ట్ అయిందా? చేతులకు సంకెళ్లతో పోలీస్ వ్యాన్ లో నుంచి దిగిన మృణాల్ ఠాకూర్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు మృణాల్ ఠాకూర్ చేతికి బేడీలు ఎందుకు వేశారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం డిఫరెంట్ గా చేసిన ప్లాన్.

డెకాయిట్ ట్రైలర్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ‘డెకాయిట్’. శనివారం (ఏప్రిల్ 4) ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాతో ట్రైలర్ అదిరిపోయింది.
సంకెళ్లతో మృణాల్ ఠాకూర్
ఓ వైపు డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ చేతులకు సంకెళ్లతో ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే డెకాయిట్ మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. పోలీస్ వ్యాన్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ను తీసుకొచ్చారు.
వీడియోలు వైరల్
పోలీస్ వ్యాన్ లో నుంచి ఫస్ట్ మృణాల్ ఠాకూర్ దిగింది. ఆమె చేతికి బేడీలు ఉన్నాయి. ఆ సంకెళ్లను మరో నటుడు అనురాగ్ కశ్యప్ పట్టుకున్నారు. డెకాయిట్ సినిమాలో అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశాడు. వీళ్ల వెనకాలే అడివి శేష్ పోలీస్ వ్యాన్ లో నుంచి దిగాడు. ఇప్పుడీ వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అదిరిన ట్రైలర్
ఈ రోజు రిలీజైన డెకాయిట్ ట్రైలర్ అదిరింది. ఇది ప్రేమ, మోసం, రివేంజ్ చుట్టూ తిరిగే కథలా కనిపిస్తోంది. ట్రైలర్ లో యాక్షన్, లవ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లవర్స్ గా కనిపించారు. కానీ హీరోను హీరోయిన్ వదిలి వెళ్లిపోయినట్లు కనిపించింది.
ఆ తర్వాత హీరోయిన్ ఓ పాపతో కనిపించింది. అప్పుడు హీరోయిన్ ను హీరో కలుస్తాడు. పాపకు హెల్త్ ప్రాబ్లం ఉంది, సర్జరీ కోసం రూ.కోట్లు కావాలని తెలుస్తుంది. ఈ డబ్బు కోసం హీరో హీరోయిన్ కలిసి దొంగతనం చేస్తారు. ట్రైలర్ చివర్లో హీరోయిన్ ను హీరో మోసం చేసినట్లు కనిపించింది.
డెకాయిట్ రిలీజ్ డేట్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి షనీల్ డియో డైరెక్టర్. ఈ మూవీకి సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూసర్. ఇందులో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


