నిద్రలోనూ ఏడ్చేదాన్ని.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మృణాల్ ఠాకూర్.. అభిమాని, స్టార్ హీరో మాటలతో మారిన జీవితం

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది.  బాడీ షేమింగ్, ఆన్ లైన్ ట్రోలింగ్ తో ఎంతో బాధపడ్డట్లు పేర్కొంది. కానీ ఓ అభిమానిని కలవడం, ఓ స్టార్ హీరో సలహాతో తన జీవితమే మారిపోయిందని చెప్పింది.

Published on: Feb 24, 2026, 11:20:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీతారామం లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అలాంటి భామ తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ అనుభవాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన బాడీ షేమింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ ట్రోలింగ్ తో కుంగిపోయినట్లు వివరించింది. ఒక ఫ్యాన్, ఒక స్టార్ హీరో మాటలతో తాను తిరిగి ఆత్మవిశ్వాసం పొందడం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడింది.

మృణాల్ ఠాకూర్ (instagram-Mrunal Thakur)
మృణాల్ ఠాకూర్ (instagram-Mrunal Thakur)

బాడీ షేమింగ్

తాను లావుగా ఉన్నాననే బాడీ షేమింగ్ తో దాని గురించే ఆలోచిస్తూ చాలా ఏడ్చేదాన్ని అని గతం గురించి మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. "నాకు అలాంటి కొన్ని రోజులున్నాయి. బాడీ షేమింగ్ వల్ల ఏడుస్తూ పడుకున్న రోజులున్నాయి, నిద్రలోనూ ఏడ్చేదాన్ని. ఎరుపెక్కిన, వాచిన కళ్లతోనే మేల్కొనేదాన్ని. 'ఇది కరెక్ట్ కాదు’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని’’ అని న్యూస్ 18తో మృణాల్ ఠాకూర్ చెప్పింది.

అభిమాని మాటతో

బాడీ షేమింగ్, ఆన్ లైన్ ట్రోలింగ్ కారణంగా తీవ్ర ఆవేదనకు గురైన మృణాల్ ఠాకూర్ ఒక ఫ్యాన్ మాటలతో తిరిగి సంతోషాన్ని పొందగలిగింది. ‘‘ఓ సారి నన్ను ఓ అభిమాని కలిశాడు. నా శరీరాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశాడు. అప్పుడే నేను రియలైజ్ అయ్యా. వేరేవాళ్ల శరీరంలా నా బాడీ ఉండాలని అనుకుంటున్నానని అర్థమైంది. నన్ను నేను ఇష్టపడటం మొదలెట్టా. వేరే వాళ్లు మనల్ని గుర్తించాలని అనుకోవడం కరెక్ట్ కాదనుకున్నా. నాకు నేను ఎంతో విలువైన అమ్మాయిగా అనిపించింది’’ అని మృణాల్ ఠాకూర్ వెల్లడించింది.

అక్షయ్ కుమార్ సలహా

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా కూడా తన ఆలోచన విధానాన్ని మార్చిందని మృణాల్ ఠాకూర్ పేర్కొంది.

"నేను అక్షయ్ సర్‌ను కలిశా. 'నీ ఈ రూపాన్ని నువ్వు అంగీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను రెచ్చగొట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. అనవసరమైన వెయ్యి మాటలు చెప్పే గొంతులు నీ చుట్టూ ఉన్నా నువ్వు వినకపోవడం చాలా గొప్ప విషయం. నీకు ఏది అనిపిస్తే అదే చేయ్. ఒక పాత్ర కోసం బరువు తగ్గాలనుకుంటే తగ్గు’ అని అక్షయ్ చెప్పాడు. ఆ మాటలు నాపై ప్రభావం చూపాయి’’ అని మృణాల్ చెప్పింది.

లేటెస్ట్ మూవీ

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ మూవీ 'దో దీవానే సేహర్ మే' ఫిబ్రవరి 20, 2026న రిలీజ్ అయింది. ఈ హిందీ మూవీలో సిద్ధార్థ్ చతుర్వేది హీరో. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో రూ.45 కోట్లు కలెక్ట్ చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More