ధనుష్ సర్‌కు నేను వీరాభిమానిని.. ఆరోజు ఆ ప్రీమియర్‌కు రావడం వెనుక ఓ కారణం ఉంది..: మృణాల్ ఠాకూర్ కామెంట్స్

ధనుష్ తో డేటింగ్, పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ స్పందించింది. అసలు ఈ పుకార్లు ఎక్కడ మొదలయ్యాయో, దాని వెనుక కారణమేంటో ఆమె వెల్లడించింది. అంతేకాదు తాను ధనుష్ కు వీరాభిమానినని, ఏదో ఒక రోజు అతనితో కలిసి నటించాలని ఉందని చెప్పింది.

Feb 20, 2026, 14:58:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే తన లేటస్ట్ మూవీ 'దో దీవానే సెహెర్ మే' (Do Deewane Seher Mein) ప్రమోషన్స్‌లో భాగంగా ‘మిర్చి ప్లస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఈ రూమర్లకు చెక్ పెడుతూ అసలు నిజం ఏంటో బయటపెట్టింది.

ధనుష్ సర్‌కు నేను వీరాభిమానిని.. ఆరోజు ఆ ప్రీమియర్‌కు రావడం వెనుక ఓ కారణం ఉంది..: మృణాల్ ఠాకూర్ కామెంట్స్
ధనుష్ సర్‌కు నేను వీరాభిమానిని.. ఆరోజు ఆ ప్రీమియర్‌కు రావడం వెనుక ఓ కారణం ఉంది..: మృణాల్ ఠాకూర్ కామెంట్స్

డేటింగ్ పుకార్లు ఇలా మొదలు

గతేడాది జులైలో ఆనంద్ ఎల్ రాయ్, కృతి సనన్‌ తో కలిసి ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా రాపప్ పార్టీకి మృణాల్ ఠాకూర్ హాజరైంది. ఆ తర్వాత ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' (Son of Sardaar 2) మూవీ ప్రీమియర్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. వీరిద్దరూ ఇలా ఒకరి ఈవెంట్లకు ఒకరు హాజరుకావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఇవి కాస్తా ముదిరిపోయి ఏకంగా ఈ ఏడాది వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజున ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

ఆ ప్రీమియర్‌కు ధనుష్ ఎందుకొచ్చాడంటే?

ధనుష్ తన ప్రీమియర్‌కు ఎందుకు వచ్చాడో వివరిస్తూ మృణాల్ అతనిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. "నేను ధనుష్ సార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నటించిన రాయన్, మారి, రాంఝనా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' సినిమాను ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఆయన నటన అద్భుతం. ఇతర నటుల నుంచి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబట్టగల సత్తా ఆయన సొంతం" అని ప్రశంసించింది.

కేవలం నటుడిగానే కాకుండా ఒక ఫెంటాస్టిక్ లిరిసిస్ట్, సింగర్, డాన్సర్, డైరెక్టర్‌గా ధనుష్‌ను మృణాల్ కొనియాడింది. "'తేరే ఇష్క్ మే' షూటింగ్ సమయంలో నేను సరదాగా.. సార్, మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కు రాగలరా? అని అడిగాను. ఆయన వస్తారని నేను అస్సలు అనుకోలేదు. కానీ నిజంగానే ఆయన రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను" అని మృణాల్ వివరించింది.

ఫిబ్రవరి 14న పెళ్లి వార్తలపై స్పందన

గతంలోనే గలాటా ప్లస్ కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్.. పుకార్లను పూర్తిగా కొట్టిపారేసింది. "నేనా? లేదు. వాళ్లు చెప్పేది చూస్తుంటే ఫిబ్రవరి 14 కాస్త ఏప్రిల్ 1లా అనిపిస్తోంది. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో నాకు తెలియదు. నేను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాసేశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇది భయంగా కూడా ఉంది" అని పేర్కొంది.

తనకు ఇష్టమైతే వచ్చే ఏడాది వివాహం చేసుకుంటానని, కానీ ఆలోపు తాను నెరవేర్చుకోవాల్సిన ఒక బకెట్ లిస్ట్ ఉందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి మృణాల్ నటించిన 'దో దీవానే సెహెర్ మే' సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More