హృతిక్ రోషన్ తో సినిమా చేస్తున్నానని తెలిసి అసూయతో 15 కిలోలు తగ్గాడు.. మాజీ లవర్ గురించి మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హృతిక్ రోషన్ తో సినిమా చేస్తున్నానని తెలిసి తన మాజీ లవర్ అసూయతో 15 కిలోల బరువు తగ్గాడని ఆమె వెల్లడించింది. 

Feb 19, 2026, 13:42:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ మధ్య రిలేషన్ షిప్ కామెంట్లతో మృణాల్ ఠాకూర్ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన మాజీ లవర్ గురించి చెప్పింది. హ్యాండ్సమ్ హీరోలతో తాను సినిమాలు చేస్తుంటే.. అసూయ, అభద్రతాభావంతో తన బాయ్ ఫ్రెండ్ బరువు పెరిగాడని వెల్లడించింది. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన 'దో దీవానే సెహర్ మే' ప్రమోషన్ లో భాగంగా మృణాల్ ఈ కామెంట్లు చేసింది.

హృతిక్ రోషన్, మృణాల్ ఠాకూర్
హృతిక్ రోషన్, మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్ కామెంట్లు

దో దీవానే సెహర్ మే మూవీ ప్రమోషన్లలో భాగంగా ‘రిలేషన్ షిట్ అడ్వైజ్’ అనే షోలో మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది పాల్గొన్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లాంటి హ్యాండ్సమ్ హీరోలతో సినిమాలు చేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ అసూయ, అభద్రతా భావంతో బరువు తగ్గాడని మృణాల్ పేర్కొంది.

బరువు తగ్గి

‘‘నా కెరీర్ స్టార్టింగ్ లో నేను హృతిక్ రోషన్, ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో సినిమాలు చేశా. అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ తెగ అసూయ పడేవాడు. హ్యాండ్సమ్ హీరోలతో షూటింగ్ అనేసరికి ఇన్ సెక్యూరిటీతో ఉండేవాడు. ఆ వ్యక్తి స్కాండినేవియన్ (ఐరోపాలోని ఓ ప్రాంతానికి చెందినవాళ్లు). నేను చాలా మంది అందమైన అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నానని, వారితో షూటింగ్ చేస్తున్నానని అనుకున్నాడు. అతను జిమ్ చేశాడు. కండలు పెంచితే నాకు నచ్చుతుందేమోనని 15 కేజీలు తగ్గాడు’’ అని మృణాల్ ఠాకూర్ తెలిపింది.

‘‘నా కోసం అతను కండలు పెంచాడు. కానీ తర్వాత ఎందుకో జిమ్ ఆపేసి 20 కేజీలు పెరిగాడని తెలిసింది. నేను అతణ్ని ఎప్పుడూ బరువు తగ్గమని అడగలేదు. అలాగే నాకు కండలు ఉన్న మగాడితో డేటింగ్ చేయాలని ఉందని కూడా చెప్పలేదు. అతనే ఇన్ సెక్యూరిటీతో అలా చేశాడు’’ అని మృణాల్ చెప్పింది.

ఈ సినిమాలో

మృణాల్ 2019లో హృతిక్ రోషన్ తో కలిసి 'సూపర్ 30' సినిమాలో నటించింది. 2022లో షాహిద్ కపూర్ తో 'జెర్సీ' మూవీలో యాక్ట్ చేసింది. ఈ హీరోలతో యాక్టింగ్ చేసిన కారణంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ అసూయ చెందాడని మృణాల్ చెప్పింది. మరోవైపు తన కాలేజీలో రిచ్ గర్ల్స్ ను చూసి తాను జెలస్ ఫీల్ అయినట్లు సిద్ధాంత్ చతుర్వేది పేర్కొన్నాడు. తను ఇష్టపడ్డ అమ్మాయి కూడా రిచ్ అని పేర్కొన్నాడు.

మృణాల్ పై రూమర్లు

మృణాల్ ఠాకూర్ రిలేషన్ షిప్ స్టేటస్ పై ఇటీవల రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఆమె డేటింగ్ లో ఉందనే వార్తలు వచ్చాయి. వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపించింది. కానీ అవన్నీ అబద్ధాలని మృణాల్ స్పష్టం చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More