ఒకే ఒక్క నటుడితో డేటింగ్ చేశాను.. అతనికి అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిందని తర్వాత తెలిసింది: నటి మమతా మోహన్‌దాస్ కామెంట్స్

ప్రముఖ నటి, సింగర్ మమతా మోహన్‌దాస్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జోస్ ఆలుక్కాస్ (Jos Alukkas) పాడ్‌కాస్ట్‌లో సీనియర్ నటి సుహాసినితో మాట్లాడుతూ.. తనకు ఎంగేజ్మెంట్ అయిన విషయం దాచిపెట్టి ఒక నటుడు తనతో డేటింగ్ చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Feb 16, 2026, 18:15:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో ‘యమదొంగ’, 'కింగ్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas). క్యాన్సర్‌ను జయించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె.. తాజాగా తన ప్రేమ జీవితం, పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. జోస్ ఆలుక్కాస్ ఆధ్వర్యంలో నటి సుహాసిని (Suhasini) హోస్ట్ చేస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంది.

ఒకే ఒక్క నటుడితో డేటింగ్ చేశాను.. అతనికి అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిందని తర్వాత తెలిసింది: నటి మమతా మోహన్‌దాస్ కామెంట్స్
ఒకే ఒక్క నటుడితో డేటింగ్ చేశాను.. అతనికి అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిందని తర్వాత తెలిసింది: నటి మమతా మోహన్‌దాస్ కామెంట్స్

"ఎంగేజ్మెంట్ విషయం దాచాడు.."

తన క్యాన్సర్ చికిత్స తర్వాత, పెళ్లికి ముందు తాను ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ చేశానని మమతా మోహన్‌దాస్ తెలిపింది. "నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడితో డేటింగ్ చేశాను. అతను నన్ను డేట్‌కి అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా అమ్మ పర్మిషన్ తీసుకుని మరీ వెళ్లాను. కానీ అప్పటికే అతనికి ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం నాకు తెలియదు. ఒక నెల తర్వాత వాళ్ళ అన్నయ్య ద్వారా నాకు ఆ నిజం తెలిసింది. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి గుండె పగిలింది. నన్ను ఎందుకు మోసం చేశాడో అర్థం కాలేదు" అని మమతా ఆవేదన వ్యక్తం చేసింది.

క్యాన్సర్ తర్వాత ఆత్రుతలో..

తనకు రిలేషన్షిప్స్, డేటింగ్ గురించి పెద్దగా అవగాహన లేదని మమతా చెప్పింది. "నాకు క్యాన్సర్ అని తెలిసిన మొదటి ఏడాది తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. ఒక మహిళగా నాకున్న అంచనాలను, కోరికలను నెరవేర్చుకోవాలనే ఆత్రుతలో తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను. నా జబ్బు కారణంగా పార్ట్‌నర్స్ నన్ను సీరియస్‌గా తీసుకుంటారని అమాయకంగా నమ్మాను. కానీ అది నా పొరపాటు" అని ఆమె వివరించింది. మరో వ్యక్తితో కూడా డేటింగ్ చేశానని, కానీ అతను ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు కాదని తెలిపింది.

మమత పెళ్లి - విడాకులు..

2011లో మమతా.. బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవలేదు. కేవలం ఆరు నెలలకే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2012లో విడాకులు తీసుకున్నారు. "నేను చాలా చిన్న వయసులో, అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరిగిందేమో" అని ఆమె అభిప్రాయపడింది.

2005లో 'మయూఖం' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన మమతా.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 2010లో హాడ్జికిన్ లింఫోమా (Hodgkin lymphoma) క్యాన్సర్ బారిన పడ్డ ఆమె.. దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. ఇటీవల విజయ్ సేతుపతి 'మహారాజా' సినిమాలో కనిపించిన ఆమె.. త్వరలో 'మై డియర్ సిస్టర్' అనే సినిమాలో కనిపించనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More