ఆ సినిమాల ఎఫెక్ట్.. రేస్ నుంచి అడివి శేష్ ఔట్.. డెకాయిట్ రిలీజ్ పోస్ట్‌పోన్‌.. కొత్త డేట్ ఇదే

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రాబరీ థ్రిల్లర్ ‘డెకాయిట్’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. మార్చి 19, 2026న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమాను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ఇందుకు ఆ రెండు సినిమాలే కారణం. అదేంటో చూసేయండి. 

Published on: Feb 4, 2026, 12:14:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అడివి శేష్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ అంటూ రాబరీ థ్రిల్లర్ ను రెడీ చేశాడు. కానీ ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన సినిమాను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఎందుకంటే అదే రోజు ధురంధర్ 2, టాక్సిక్ లాంటి పెద్ద సినిమాల రిలీజ్ ఇండటమే కారణం.

డెకాయిట్ రిలీజ్ పోస్ట్ పోన్
డెకాయిట్ రిలీజ్ పోస్ట్ పోన్

డెకాయిట్ రిలీజ్ వాయిదా

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ‘డెకాయిట్’. మేకర్స్ ఈ మూవీని మార్చి 19, 2026న రిలీజ్ చేయాలని ఫస్ట్ అనుకున్నారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలను వాయిదా వేశారు. డెకాయిట్ మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త డేట్

డెకాయిట్ మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసిన మేకర్స్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇక మార్చి 19న ప్రధానంగా ధురంధర్ 2, టాక్సిక్ మధ్య పోటీ నెలకొంది. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ థియేటర్లలోకి రానుంది. మరోవైపు హై యాక్షన్ థ్రిల్లర్ గా యష్ టాక్సిక్ రిలీజ్ కానుంది.

డెకాయిట్ గురించి

డెబ్యూట్ దర్శకుడు షనీల్ డియో దర్శకత్వం వహించిన డెకాయిట్ మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లు. ఈ సినిమాలో మాజీ ప్రేమికులైన ఇద్దరు వ్యక్తులు కొన్ని దొంగతనాలు చేయాల్సి వస్తుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి 'టైమ్స్ నౌ'తో మాట్లాడుతూ అడివి శేష్.. డెకాయిట్ ను ఆధునిక ‘షోలే’ మూవీ అని పిలిచాడు. ‘‘ఇది చాలా ఎమోషనల్, కోపంతో కూడిన కథ. డెకాయిట్ లో నవ్వు, కోపం, కన్నీళ్లు.. ఇలా సినిమాల్లో ఉండాల్సిన ప్రతి ఎమోషన్ ఉంటుంది’’ అని అడివి శేష్ చెప్పాడు.

ధురంధర్ ది రివెంజ్ వర్సెస్ టాక్సిక్

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అభిమానులు దాని సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు.

మరోవైపు యష్ 'టాక్సిక్' మూవీ దాని బోల్డ్ టీజర్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More