ధురంధర్ 2 టీజర్ ఔట్.. కొత్తగా లేదు.. డైరెక్టర్ స్కామ్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్

ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అప్ డేట్ వచ్చింది.  బ్లాక్ బస్టర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న ధురంధర్ ది రివేంజ్ టీజర్ ఇవాళ రిలీజైంది. అయితే ఈ టీజర్ లో కొత్తగా ఏం లేదని, డైరెక్టర్ స్కామ్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

Published on: Feb 3, 2026, 12:36:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ సీక్వెల్ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ధురంధర్ ది రివేంజ్ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ ను మంగళవారం (ఫిబ్రవరి 3) మేకర్స్ రిలీజ్ చేశారు. మరింత హింసతో కూడిన ఈ టీజర్ లో రణ్ వీర్ సింగ్ నట విశ్వరూపం చూపించాడు. అయితే టీజర్ లో కొత్తదనం ఏం లేదని, డైరెక్టర్ స్కామ్ చేశాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ధురంధర్ 2లో రణ్ వీర్ సింగ్ (youtube)
ధురంధర్ 2లో రణ్ వీర్ సింగ్ (youtube)

ధురంధర్ టీజర్ రిలీజ్

బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ వచ్చేస్తోంది. ధురంధర్ ది రివేంజ్ పేరుతో రెడీ అయిన ఈ మూవీ నుంచి టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. రణ్ వీర్ సింగ్ మరోసారి హమ్జాగా తన యాక్షన్, హింసను చూపించాడు. ఈ రివేంజ్ స్టోరీ అతను మరింతగా ఆయుధంతో చెలరేగిపోయాడు. ఈ టీజర్ లో గ్యాంగ్ స్టర్ గా అతను ఎదిగిన తీరు చూపించారు.

స్పై థ్రిల్లర్

ధురంధర్ ది రివేంజ్ ఓ స్పై థ్రిల్లర్. డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు దీని సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ రాబోతుంది. మార్చి 19, 2026న ఇది రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ (హమ్జా) పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను లోపలి నుంచి ఫినిష్ చేసే క్యారెక్టర్ లో నటించాడు.

ఫ్యాన్స్ రియాక్షన్

ధురంధర్ సీక్వెల్ టీజర్ పై భారీ అంచనాలే పెట్టుకున్న ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ టీజర్ లో కొత్తగా ఏం లేదని, పాత సీన్లే మళ్లీ చూపించారని అంటున్నారు. జియో స్టూడియోస్ మంగళవారం మధ్యాహ్నం టీజర్‌ను విడుదల చేసింది. ఇది రణ్‌వీర్ (జస్కిరాత్ అలియాస్ హమ్జా) తన మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడాన్ని చూపించింది.

ఆ సీన్లతోనే

సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్‌ల సన్నివేశాలతో పాటు, లైరీ అండర్‌వరల్డ్‌లో హమ్జా ఎదిగే తీరు కనిపించింది. అయితే చాలా మంది అభిమానులు ధురంధర్ సినిమా ఎండింగ్ క్రెడిట్స్ లో చూపించిన సీన్లతోనే ఈ సీక్వెల్ టీజర్ ఉందని ఫైర్ అవుతున్నారు. చాలా మంది కామెంట్లలో తమ నిరాశను వ్యక్తం చేశారు.

"ఇది అదే. కొత్త విజువల్స్ లేవు" అని ఓ ఫ్యాన్ ఫైర్ అయ్యాడు. "డైరెక్టర్ ఆదిత్య ధర్ టీజర్ పేరుతో స్కామ్ చేశాడు" అని మరొకరు మండిపడ్డారు. "కొత్తది ఏదైనా చూపిస్తారని నిజంగా అనుకున్నా" అని మరో యూజర్ రాసుకొచ్చాడు. ధురంధర్ సీక్వెల్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More