తండ్రి బిజినెస్ చేయాలనుకునే కుర్రాడు.. కడుపుబ్బా నవ్విస్తున్న సుహాస్ హే భగవాన్ టీజర్.. రిలీజ్ డేట్ ఇదే

యువ హీరో సుహాస్ మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ను నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. అతని అప్ కమింగ్ మూవీ హే భగవాన్ టీజర్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫన్నీగా ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. 

Published on: Jan 28, 2026 12:22 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సుహాస్ మరో కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో థియేటర్లకు రాబోతున్నాడు. అతను హీరోగా రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ ‘హే భగవాన్’. ఈ సినిమా టీజర్ ను ఇవాళ (జనవరి 28) రిలీజ్ చేశారు. ఫన్నీ ఎలిమెంట్స్, డైలాగ్స్ తో టీజర్ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయనే కామెంట్లు వస్తున్నాయి.

హే భగవాన్ మూవీ టీజర్ ఔట్ (x/vamsi nandipati)
హే భగవాన్ మూవీ టీజర్ ఔట్ (x/vamsi nandipati)

హే భగవాన్ టీజర్

సుహాస్, శివాని నాగారం జంటగా నటిస్తున్న మూవీ ‘హే భగవాన్’. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం (జనవరి 28) రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ వీకే, సుదర్శన్ తదితరులు కూడా నటిస్తున్నారు. టీజర్ కామెడీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సినిమా కడుపుబ్బా నవ్వించేలా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

బిజినెస్ చేయాలని

చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే కోరికతో ఉన్న యువకుడి కథే హే భగవాన్. నాకు ఎలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంది అని చిన్నప్పటి హీరో క్యారెక్టర్ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెద్ద బిజినెస్ మాన్ లా సీనియర్ నటుడు నరేష్ వీకే ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి కామెడీతో టీజర్ నవ్విస్తూనే ఉంది.

నెల రోజుల్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని నాన్న బిజినెస్ టేకప్ చేయాల్రా అంటూ ఫ్రెండ్ తో చెప్తాడు హీరో. కానీ వాళ్ల నాన్న చేసే బిజినెస్ ఏంటీ అన్నది మాత్రం ఎవరికీ చెప్పరు. ఈ సీక్రెట్ బిజినెస్ ట్విస్ట్ బాగుంది.

హీరోయిన్ ఎంట్రీ

హే భగవాన్ సినిమాలో హీరోయిన్ చేస్తున్న శివాని నాగారం కూడా కామెడీ టైమింగ్ తో అదరగొట్టింది. తాతయ్య స్ఫూర్తితోనే సాగుతున్నానని హీరోయిన్ అంటే, ఆయన ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని హీరో ఫ్రెండ్ సుదర్శన్ అంటాడు. ఆయన ఇంకా ఉన్నారండీ అని హీరోయిన్ చెప్పడం భలే కుదిరింది. అక్కడి నుంచి హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, బిజినెస్ చుట్టూ తిరిగే కామెడీ ట్రాక్ అదిరిపోయాయి.

రిలీజ్ డేట్

హే భగవాన్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను ఫిబ్రవరి 20, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. గోపీ ఆచారా ఈ చిత్రానికి డైరెక్టర్.