ఏఐతో పవర్ స్టార్ కుమారుడు అకీరా సినిమా.. ఇది దోపిడీ చేయడమే.. నిషేధం విధించిన హైకోర్టు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఏఐని ఉపయోగించి తనపై సినిమా రూపొందించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి తయారుచేసిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించినట్టుగా పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన సినిమాలోత తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని తెలిపాడు.

అకీరా ఏఐ సినిమా భారీగా వ్యూస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన పూర్తి నిడివి గల చిత్రాన్ని అనధికారికంగా సృష్టించడం ద్వారా తన వ్యక్తిత్వం, ప్రచారం, గోప్యతా హక్కులను పెద్ద ఎత్తున ఉల్లంఘించారని ఆరోపిస్తూ అకీరా నందన్ పిటిషన్‌లో కోర్టుకు వివరించాడు. ఏఐ లవ్ స్టోరీ అనే ఏఐ రూపొందించిన సినిమాను యూట్యూబ్‌లో బహుళ వెర్షన్లలో అప్‌లోడ్ చేశారని తెలిపాడు. జనవరి 22, 2026 నాటికి తెలుగు భాషా వెర్షన్ 1,109,255 వీక్షణలను, ఆంగ్ల భాషా వెర్షన్ 24,354 వ్యూస్ వచ్చాయని ఈ విషయం కోర్టు దృష్టికి వెళ్లింది.
అకీరాపై ఫేక్ ప్రొఫైల్స్
అయితే ఏఐ సినిమాతోపాటుగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో తన పేరుపై ఫేక్ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని అకీరా కోర్టుకు పిటిషన్‌లో వెల్లడించాడు. ఈ ఖాతాలలో కొన్ని తన పేరుతో విరాళాలు కోరుతున్నాయని, దీనివల్ల మోసం, ఆర్థిక దుర్వినియోగం జరుగుతుందనే ఆందోళనలు లేవనెత్తుతున్నాయని అకీరా ఆరోపించాడు.
వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టును అకీరా అభ్యర్థించాడు. అతడి పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
దోపిడీ చేయడమేనన్న కోర్టు
ఏఐ సాయంతో తీసిన సినిమాపై నిషేధం విధించింది హైకోర్టు. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని కోర్టు కామెంట్స్ చేసింది. పిటిషనర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా.. కంటెంట్‌ను రూపొందిస్తే.. ప్రైవసీకి భంగం కలుగుతుందని, ఇది గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని చెప్పింది.
అకీరాకు ఫ్యాన్స్
'కేసులోని వాస్తవాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా చూస్తే అకీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినోద పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి అని తెలుస్తోంది. వాది చిన్నవాడు అయినప్పటికీ, అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రజలలో, వినోద పరిశ్రమలో అతని ప్రజాదరణను సూచిస్తుంది.' అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏఐ సినిమాపై నిషేధం
దీనికి సంబంధించి కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏఐతో రూపొందించిన సినిమాపై నిషేధం విధించాలని, సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపీ వివరాలను బహిర్గతం చేయాలని తెలిపింది. ఈ కేసు విచారణ జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఎదుట జరిగింది. అకీరా తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ దిల్లీ హైకోర్టులు పిటిషన్ వేశారు. గూగుల్ తరఫున ఆదిత్యా గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


