ధనుష్‌తో డేటింగ్ రూమర్లు-ప్రతి ఒక్కరూ ప్రేమలో పడాలి- దాన్ని అందుకోవడం కష్టం- ఒక లవర్ ఉంటాడంటూ మృణాల్ ఠాకూర్ కామెంట్లు
ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ రూమర్లు కోడై కూస్తున్నాయి. వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేమ గురించి, బంధం గురించి మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
ఇటీవల తరుచుగా వార్తల్లో వినిపిస్తున్న జోడీ.. మృణాల్ ఠాకూర్, ధనుష్. తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ఉందని, డేటింగ్ నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రేమపై, బంధంపై మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

మృణాల్ ఠాకూర్ కామెంట్లు
మృణాల్ రీసెంట్ గా 'ఫిల్మీగ్యాన్'తో మాట్లాడుతూ ప్రేమ గురించి చెప్పింది. "ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడాలని నేను భావిస్తా. ఇది మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా మారుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన విషయాలలో ఒకటి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమను కనుక్కోవాలని నేను ఆశిస్తున్నా’’ అని మృణాల్ ఠాకూర్ తెలిపింది.
లవర్ ఉంటాడు
ప్రేమలో ఉన్న అమ్మాయిలే తమ ప్రియుడు గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, ఏదైనా ఎక్కువగా ఇస్తారనే మాటలను మృణాల్ ఠాకూర్ ఖండించింది. "కొన్నిసార్లు ప్రేమను అందుకోవడం, అంగీకరించడం చాలా కష్టం. నిర్వచనం మారుతూ ఉంటుంది. ప్రేమ మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఒక లవర్ ఉంటాడు. ఒక ప్రియమైన వ్యక్తి ఉంటాడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. మీరు సరెండర్ అయిపోతారు’’ అని మృణాల్ ఠాకూర్ తెలిపింది.
మృణాల్, ధనుష్ డేటింగ్
ఆగస్టు 2025లో 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ షో కోసం మృణాల్, ధనుష్ కలిసి కనిపించారు. దీంతో వాళ్ల డేటింగ్ పుకార్లు గుప్పుమన్నాయి. వీరిద్దరూ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజున పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే.. "మృణాల్ పెళ్లి చేసుకోవడం లేదు. ఇది పుకారు మాత్రమే" అని ఓ సోర్స్ హిందూస్థాన్ టైమ్స్ కు తెలిపింది.
ఈ సినిమాతో
మృణాల్ ఠాకూర్, సిద్ధార్థ్ చతుర్వేది కలిసి 'దో దీవానే షెహర్ మే’ అనే సినిమా చేస్తున్నారు. అభిరుచి చంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణా సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భారత్ కుమార్ రంగ కలిసి నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.
మరోవైపు ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ధనుష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతున్నాడు. ధనుష్ కొత్త సినిమాలో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లు అని రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


