నేను స్టేజ్‌పై తొలిసారి డ్యాన్స్ చేసింది ఈ పాటకే.. అందుకే ఇప్పుడు నా సినిమాలో ఆ పాట పెట్టాను: అడివి శేష్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ ఈ ఏడాది డెకాయిట్ మూవీతో వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాలో తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ సాంగ్ ఉండటంపై అతడు స్పందించాడు. ఈ హిందీ పాట అంటే తనకు ఎంత ఇష్టమో అతడు చెప్పుకొచ్చాడు.

Published on: Jan 6, 2026, 14:55:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ వెర్సటైల్ హీరో అడివి శేష్ తన నెక్ట్స్ మూవీ 'డెకాయిట్' (Dacoit) కోసం ఒక క్రేజీ నిర్ణయం తీసుకున్నాడు. 90వ దశకంలో దేశాన్ని ఊపేసిన హిందీ పాట "తూ చీజ్ బడి హై మస్త్ మస్త్" (Tu Cheez Badi Hai Mast Mast)ను ఈ సినిమాలో రీమిక్స్/రీక్రియేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హక్కులను అధికారికంగా కొనుగోలు చేసినట్లు శేష్ వెల్లడించాడు.

నేను స్టేజ్‌పై తొలిసారి డ్యాన్స్ చేసింది ఈ పాటకే.. అందుకే ఇప్పుడు నా సినిమాలో ఆ పాట పెట్టాను: అడివి శేష్ కామెంట్స్
నేను స్టేజ్‌పై తొలిసారి డ్యాన్స్ చేసింది ఈ పాటకే.. అందుకే ఇప్పుడు నా సినిమాలో ఆ పాట పెట్టాను: అడివి శేష్ కామెంట్స్

చిన్నప్పటి మెమొరీ.. స్కూల్ స్టేజ్ పై డాన్స్

గూఢచారి, మేజర్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. ఇప్పుడు 'డెకాయిట్' అనే ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాలో ఒకప్పటి క్లాసిక్ సాంగ్ ను వాడటానికి గల ఆసక్తికర కారణాన్ని అతడు బయటపెట్టాడు. 'మొహ్రా' (Mohra - 1994) సినిమాలోని ఈ పాటంటే శేష్ కు చాలా ఇష్టమట.

"కొన్ని పాటలు మనతో పాటే ఉండిపోతాయి. 90ల్లో పెరిగిన మాకు ఈ పాట అంటే ఒక వైబ్. నిజానికి నేను స్కూల్ స్టేజ్ మీద చేసిన మొట్టమొదటి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ పాటకే (మెడ్లీలో భాగంగా). ఆ జ్ఞాపకం నాకింకా గుర్తుంది. అందుకే సినిమా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు.. ఈ పాటను కేవలం ఒక గిమ్మిక్కులా కాకుండా, ఒక ఎమోషన్ లాగా వాడాలనిపించింది. చిన్నప్పుడు మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ని ప్రేమించిన ఆ కుర్రాడికి నేను ఇచ్చే గౌరవం ఇది" అని శేష్ ఎమోషనల్ అయ్యాడు.

అధికారికంగా రైట్స్ తీసుకుని..

ఏదో సరదాగా వాడేయకుండా, ఆ పాటకు పూర్తి గౌరవం ఇస్తూ.. నిర్మాతల ద్వారా పాట హక్కులను కొనుగోలు చేసిన తర్వాతే సినిమాలో వాడుతున్నట్లు శేష్ క్లారిటీ ఇచ్చాడు. ప్రేక్షకులు ఈ పాట విన్నప్పుడు ఆ నోస్టాల్జియాను ఫీల్ అవ్వాలని అతడు కోరుకుంటున్నాడు.

ఇక 'డెకాయిట్' సినిమా విషయానికి వస్తే ఇందులో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. తనను మోసం చేసిన మాజీ ప్రేమికురాలిపై పగ తీర్చుకోవాలనుకునే ఒక కోపంతో రగిలిపోయే ఖైదీ కథ ఇది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. గత నెలలోనే మేకర్స్ టీజర్స్ రిలీజ్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More